మా డైరెక్టర్స్ అందరికీ ఆయనే ఓజీ – రాజమౌళి

Game Changer Director Shankar is OG For All Film Makers, Says SS Rajamouli

ఇటు మెగాభిమానులు, అటు సినీ ప్రేక్ష‌కులు ఎంతో ఎగ్జ‌యిట్‌మెంట్‌తో ఎదురు చూస్తోన్న స‌మ‌యం రానే వ‌చ్చేసింది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ టైటిల్ పాత్రలో నటించిన భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ ‘గేమ్ ఛేంజ‌ర్‌’. చరణ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్‌గా నటించింది. శ్రీమ‌తి అనిత స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ ఈ పాన్ ఇండియా మూవీని నిర్మించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ భారీ బ‌డ్జెట్ చిత్రం సంక్రాంతి సంద‌ర్భంగా జ‌న‌వ‌రి 10న తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో గేమ్ చేంజ‌ర్ విడుద‌ల‌వుతోంది. ఇప్ప‌టికే విడుద‌లైన సాంగ్స్‌, టీజ‌ర్‌, ప్ర‌మోష‌న‌ల్ కంటెంట్‌తో సినిమాపై అంచ‌నాలు ఆకాశాన్నంటాయి. ఈ అంచ‌నాల‌ను మ‌రింత పెంచేలా తాజాగా ‘గేమ్ ఛేంజ‌ర్‌’ ట్రైల‌ర్‌ను విడుద‌ల చేసిన విషయం తెలిసిందే. ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి చేతుల మీదుగా ఈ ట్రైల‌ర్ విడుద‌ల కావ‌టం విశేషం.

ఈ నేప‌థ్యంలో ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి చిత్ర యూనిట్‌కు బెస్ట్ విషెస్ తెలియజేశారు. రాజమౌళి ఏమన్నారో ఆయన మాటల్లోనే.. “శంకర్ గారు ఫస్ట్ తెలుగు సినిమా అని అంతా చెబుతుంటే.. అవునా? నిజమా? అని అనిపించింది. కానీ తెలుగు వాళ్లకి శంకర్ గారు తమిళ దర్శకుడు కాదు.. మన తెలుగు దర్శకుడే. శంకర్ గారు అంటే తెలుగు వారందరికీ గౌరవం. ఆ గౌరవంతోనే దిల్ రాజు గారు ఈ మూవీని శంకర్ గారితో తీసి ఉంటారు.”

“ప్రస్తుతం ఉన్న కుర్ర దర్శకులు మమ్మల్ని చూసి గర్వపడుతుంటారు. కానీ మేం మాత్రం శంకర్ గారిని చూసి గర్వపడుతుంటాం. ఆయనే డైరెక్టర్లకు ఓజీ.. ఒరిజినల్ గ్యాంగ్ స్టర్. మనకున్న పెద్ద కలల్ని సినిమాగా తీస్తే.. డబ్బులు వెనక్కి వస్తాయని అందరికీ కాన్ఫిడెంట్ ఇచ్చిన డైరెక్టర్ శంకర్. ట్రైలర్‌ను రిలీజ్ చేసే ఛాన్స్ ఇచ్చినందుకు థాంక్స్. ఈ మూవీతో వింటేజ్ శంకర్ గారిని చూస్తాం. ఒకే ఒక్కడు నాకు చాలా ఇష్టమైన సినిమా. ఆ స్థాయిని మించేలా గేమ్ చేంజర్ ఉంటుందనిపిస్తుంది.” అని పేర్కొన్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.