రాపో22.. భాగ్య శ్రీ బోర్సే‌ ఫస్ట్ లుక్ రిలీజ్

Actress Bhagyashri Borse First Look Poster Released From Ram Pothineni's RAPO22

ఉస్తాద్ రామ్ పోతినేని కథానాయకుడిగా టాప్ ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో యువ దర్శకుడు మహేష్ బాబు పి ఓ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి నవీన్ ఎర్నేని, వై. రవి శంకర్ నిర్మాతలు. హీరోగా రామ్ 22వ చిత్రమిది. ఇందులో రామ్ జంటగా భాగ్యశ్రీ బోర్సే నటిస్తున్న సంగతి తెలిసిందే. RAPO 22లో సాగర్ పాత్రలో రామ్ పోతినేని నటిస్తున్నారు. ఆయన క్యారెక్టర్ లుక్ కొన్ని రోజులు క్రితం విడుదల చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

‘మీకు సుపరిచితుడు… మీలో ఒకడు… మీ సాగర్’ అంటూ ఇటీవల రామ్ క్యారెక్టర్ లుక్ విడుదల చేశారు. పాత రోజుల్లో ఉపయోగించే సైకిల్, రామ్ లాంగ్ హెయిర్ అండ్ క్లీన్ షేవ్, అన్నిటికి మించి రామ్ ముఖంలో నవ్వు… ఆ లుక్ చూడగానే ఒక ఆహ్లాదకరమైన ఫీలింగ్ కలుగుతోందని ఆడియన్స్ కాంప్లిమెంట్స్ ఇచ్చారు. ఒక్క లుక్ ద్వారా సినిమాపై అంచనాలు పెంచారు దర్శకుడు మహేష్ బాబు.

ఇక న్యూ ఇయర్ సందర్భంగా తాజాగా హీరోయిన్ భాగ్య శ్రీ బోర్సే‌ ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ‘మన సాగర్ గాడి లవ్వు… మహా లక్ష్మి’ అంటూ హీరో హీరోయిన్లు జంటగా ఉన్న పోస్టర్ విడుదల చేశారు. హీరోయిన్ భాగ్య శ్రీ లుక్ చూస్తే.. చుడీదార్ ధరించి ట్రెడిషనల్ లుక్కులో బావున్నారు. ఆవిడ కాలేజీ స్టూడెంట్ రోల్ చేస్తున్నారని అర్థం అవుతోంది. రామ్ క్యూట్ ఎక్స్ ప్రెషన్ అయితే ఆడియన్స్ అందరి మనసు దోచుకుంది.

ఇంకా టైటిల్ ఖరారు చేయని ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ ఇటీవల హైదరాబాద్‌లో పూర్తయింది. రామ్, ఇంకా ఇతర ప్రధాన తారాగణం మీద కీలక సన్నివేశాలు తీశారు. సాగర్ పాత్రలో రామ్ ఒదిగిన తీరు, ఆయన నటన ఆడియన్స్ అందరికీ ఒక ట్రీట్ అని చెప్పాలి. ప్రేక్షకులు నోస్టాల్జియాలోకి వెళతారు. ఆ పాత్రలో తమను తాము చూసుకుంటారు. హీరోయిన్ భాగ్య శ్రీ బోర్సే లుక్ సైతం అందర్నీ ఆకట్టుకుంటోంది.

రామ్, భాగ్య శ్రీ జోడీ క్యూట్ గా ఉందని అందరూ చెబుతున్నారు. సినిమాలో వీళ్లిద్దరి మధ్య వచ్చే సీన్లు హైలైట్ కానున్నాయి. ఈ చిత్రానికి ప్రొడక్షన్ డిజైనర్ అవినాష్ కొల్లా, ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్, సినిమాటోగ్రఫీ మధు నీలకందన్, మ్యూజిక్ వివేక్ – మెర్విన్ అందిస్తున్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.