PMF49లో కన్నడ స్టార్ హీరో

People Media Factory Teams up With Golden Star Ganesh For PMF49

శాండల్‌వుడ్ గోల్డెన్ స్టార్ గణేష్, తన మూవీ ‘కృష్ణం ప్రణయ సఖి’ ఇటీవల 100 రోజులు జరుపుకున్న థియేట్రికల్ బ్లాక్‌బస్టర్ విజయంతో దూసుకుపోతున్నాడు. ఇప్పుడు ఆయన తన అభిమానులకు ఎక్సయిటింగ్ వార్తను అందించారు. గణేష్ అప్ కమింగ్ కన్నడ చిత్రం #PMF49 కోసం ప్రతిష్టాత్మకమైన తెలుగు నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో కోలాబ్రెట్ అవుతున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కార్తికేయ 2, వెంకీ మామ, ఓ బేబీ, ధమాకా న్యూ-సెన్స్ వంటి బ్లాక్‌బస్టర్ హిట్‌లను అందించిన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ తెలుగు చిత్ర పరిశ్రమకు గణనీయమైన సహకారం అందించింది. #PMF49తో, వారు గణేష్ లీడ్ రోల్ లో గొప్ప సినిమాటిక్ ఎక్సపీరియన్స్ అందించడం ద్వారా కన్నడ సినిమా పట్ల తమ నిబద్ధతను చాటారు.

టీజీ విశ్వ ప్రసాద్ నేతృత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ హై క్యాలిటీ స్టొరీ టెల్లింగ్, అత్యాధునిక నిర్మాణం ద్వారా కన్నడ సినిమాను మరో లెవల్ కి తీసుకువెళ్ళడానికి అంకిత భావంతో ఉన్నారు. ఈ ప్రాజెక్ట్ కన్నడ సినిమా అపారమైన సామర్థ్యాన్ని ఒక బిగ్ స్టేజ్ పై ప్రెజెంట్ చేయాలనే వారి లక్ష్యాన్ని తెలియజేస్తోంది.

ప్రముఖ కొరియోగ్రాఫర్‌ బి. ధనంజయ దర్శకుడిగా పరిచయం కాబోతున్న ఈ చిత్రం యూనిక్ అండ్ లార్జ్ దెన్ లైఫ్ స్టొరీగా వుండబోతోంది. నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నారు. కాగా ఈ సినిమా టైటిల్, నటీనటులు, ఇతర సాంకేతిక వివరాలు త్వరలో మేకర్స్ తెలియజేయనున్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.