100 సంవత్సరాలకు పైగా ఘనచరిత్ర కలిగిన భారతీయ చిత్ర పరిశ్రమలో ఇప్పటివరకూ ఎంతోమంది దిగ్గజ దర్శకులు సినిమాపై తమ ముద్ర వేశారు. అలాంటివారిలో కోలీవుడ్ లెజెండరీ డైరెక్టర్ ఎస్. శంకర్ షణ్ముగం ఒకరు. ఈ కోలీవుడ్ స్టార్ డైరెక్టర్‌కి హీరోలకన్నా ఎక్కువ పాపులారిటీ ఉందంటే అతిశయోక్తి లేదు. దేశవ్యాప్తంగా ఎంతోమంది స్టార్ హీరోలు ఆయన దర్శకత్వంలో నటించాలని ఉవ్విళ్ళూరుతుంటారంటే అర్ధం చేసుకోవచ్చు ఆయన కెపాసిటీ ఏంటో..
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ లెజెండరీ డైరెక్టర్ తాజాగా దర్శకత్వం వహించిన పొలిటికల్ ఎంటర్‌టైనర్ ‘గేమ్ ఛేంజర్’. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, కియారా అడ్వాణీ హీరోయిన్‌గా నటించగా శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ భారీ బడ్జెట్‌తో నిర్మించారు. జనవరి 10న ప్రేక్షకుల ముందుకురానుంది.
ఇక ఈ చిత్రం ప్రమోషనల్ కార్యక్రమాల్లో భాగంగా హీరో రామ్ చరణ్ ఆయన గురించి చెబుతూ.. శంకర్ డైరెక్టర్లకే డైరెక్టర్ అని.. క్రికెట్‌కు సచిన్ టెండూల్కర్ ఎలాగో.. ఇండియన్ సినిమాకు శంకర్ అలా అని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలలో ఎలాంటి అసత్యం లేదని అన్ని చిత్ర పరిశ్రమలకు చెందినవారు ముక్త కంఠంతో అంగీకరిస్తారు. ఈ నేపథ్యంలో డైరెక్టర్ శంకర్ గురించి ప్రత్యేక కథనం..
ప్రేక్షకులను ఆలోచింపజేసే కథలు, సమకాలీన రాజకీయ ఇతివృత్తాలు, సామాజిక రుగ్మతలు, కామన్ మ్యాన్ నిత్యం ఎదుర్కొనే పలు సమస్యలు మరియు విజిలెంట్ థీమ్‌ల నేపథ్యంలో కమర్షియల్ చిత్రాలు రూపొందించడం డైరెక్టర్ శంకర్ శైలి. దీనికి అత్యాధునిక సాంకేతికత మరియు వీఎఫ్‍ఎక్స్ హంగులు వినియోగించడంలో ఆయన బహు నేర్పరి. అలాగే అన్ని క్రాఫ్టులపై పట్టున్న మంచి టెక్నిషియన్ శంకర్.
శంకర్ రూపొందించే ప్రతి చిత్రం ప్రేక్షకులకు సరికొత్త అనుభూతినిస్తుంది. మనచుట్టూ జరిగే కథలాగే అనిపిస్తుంది. అయితే తన కథానాయకుడు మాత్రం అసమాన ధైర్యసాహసాలు కలిగివుండేలా చూపిస్తాడు. ఎన్నో సమస్యలను గురించి చర్చిస్తాడు, పరిష్కారం చూపిస్తాడు. ఒక్కోసారి తెరపై కనిపించే ఆ తప్పులు మనం కూడా చేస్తుంటాం కదా అనిపిస్తుంది. ఆయన సంధించే ప్రశ్నలు మనల్నే అడుగుతున్నట్టు అనిపిస్తుంది.
1993లో వచ్చిన తొలిసినిమా జెంటిల్మెన్ నుంచి తాజాగా రాబోతున్న గేమ్ ఛేంజర్ వరకూ ప్రతి సినిమాలో సామాజిక సమస్యలే ప్రధాన ఇతివృత్తంగా ఉండటం ఆయన స్పెషాలిటీ. ఇదే శంకర్‌ను ఇతర దర్శకుల నుంచి వేరుగా చూపిస్తుంది. దేశంలో ఒక సామాన్యుడు ఎదుర్కొనే కష్ఠాలకు ముఖ్య కారణం.. రాజకీయాలు, వ్యవస్థలలో ఏళ్లుగా గూడుకట్టుకుపోయిన అవినీతి అని నిర్మొహమాటంగా చెప్పగల ధైర్యశీలి ఆయన.
అయితే తాను తీసే సినిమాలలోని కథలే కాకుండా పాటలు కూడా దర్శకుడిగా శంకర్ ప్రతిభను, ప్రత్యేకతను చూపిస్తాయి. సాధారణంగా భారీ బడ్జెట్ చిత్రాలను తెరకెక్కించే శంకర్ పాటలను కూడా అదే రేంజ్‌లో తీస్తుంటారు. ప్రతి పాటకు ఒక స్పెషల్ సిగ్నేచర్ ఉండేలా తీయడం ఆయన నైజం. అందులోనూ ప్రేమ గీతాలను తెరపై అత్యద్భుతంగా చూపడంలో ఆయన తర్వాతే అంటే అతిశయోక్తి ఏమి లేదు.
ఇక భారతీయ చిత్రాలలో పాటలకు ప్రత్యేక స్థానం ఉంటుంది. అసలు పాటలు లేని సినిమాలను ఊహించలేము. ఒక మూవీ హిట్ అవ్వాలంటే కథతో పాటు పాటలు కూడా కీలకమే. కేవలం పాటల వలనే సూపర్ హిట్ అయిన చిత్రాలు అనేకం కనిపిస్తాయి. ఇక హీరో, హీరోయిన్స్ మధ్య వచ్చే డ్యూయెట్స్ కోసం ప్రేక్షకులు చాలా ఆసక్తి కనబరుస్తుంటారు. అందులోనూ లవ్ సాంగ్స్ అంటే మరింత స్పెషల్.
అయితే కొన్ని పాటలు వినడానికి బావున్నాయనిపించినా, తెరపై చూసేటప్పుడు ప్రేక్షకుడు దానిని అంతగా ఆస్వాదించలేడు. అలాగే ఒక్కోసారి మామూలు పాట కూడా స్క్రీన్ పైన అద్భుతంగా అనిపిస్తుంది. అందుకు కారణం తెరపై దానిని చూపించే విధానమే. ఈ ప్రేమ పాటలను ఒక్కో దర్శకుడు ఒక్కోలా చిత్రీకరిస్తుంటారు. ఒక్కొక్కరిదీ ఒక్కో శైలి. అయితే ఇలాంటి పాటలను అందరికీ నచ్చేలా తీయగల దర్శకులు కొందరు మాత్రమే ఉంటారు.
లవ్ అండ్ రొమాంటిక్ సాంగ్స్ తీయడంలో డైరెక్టర్ శంకర్ స్పెషల్ మార్క్ చూపిస్తుంటారు. ఈ తరహా సాంగ్స్‌లో శంకర్ మ్యాజిక్ స్పష్టంగా కనిపిస్తుంది. దీనికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. తొలిసినిమా ‘జెంటిల్ మెన్’ నుంచి.. త్వరలో రిలీజ్ కానున్న ‘గేమ్ ఛేంజర్’ మూవీ వరకూ ప్రతి చిత్రంలో ఒక స్పెషల్ లవ్ సాంగ్ మాత్రం విజువల్ పరంగా, టేకింగ్ పరంగా ఆడియెన్స్‌ని మెస్మరైజ్ చేస్తుంది అని చెప్పొచ్చు. సాధారణంగా సినిమాలలోని పాటల కోసం సెట్టింగ్స్ వేస్తుంటారు.
అయితే శంకర్ మాత్రం మాములు సెట్టింగ్స్ కాదు, భారీ సెట్టింగ్స్ వేస్తుంటారు. అవి ఆ పాటను విజువల్‌గా నెక్స్ట్ లెవెల్లో నిలిపేలావుంటాయి. ఈ ప్రేమ గీతాలను పచ్చటి ప్రకృతి అందాల మధ్య, నేచురల్ లొకేషన్లలో చిత్రీకరిస్తుంటారు. జీన్స్ మూవీలో ‘హాయిరా హాయిరా హాయిరబ్బా’ పాటలో ప్రపంచంలోని ఏడు వింతలను చూపించి ప్రేక్షకుడిని మైమరపింపచేశారు. అందుకే ఆయన చిత్రాల్లోని పాటలు పది కాలాలపాటు నిలిచిపోయేలా ఉంటాయి.
అయితే శంకర్ కేవలం దర్శకుడే కాదు, మంచి అభిరుచి కలిగిన నిర్మాత కూడా. తన పేరుపై ‘ఎస్ పిక్చర్స్’ అనే నిర్మాణ సంస్థను స్థాపించి ఎందరో ఔత్సాహిక యువ దర్శకులకు అవకాశాలు కల్పిస్తున్నారు. సీనియర్ దర్శకుడిగా కొత్తవారికి ఇండస్ట్రీలో ఒక మార్గం చూపిస్తున్నారు. మంచి కథ, ట్యాలెంట్ ఉంటే చాలు.. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకపోయినా, తన దగ్గర అసిస్టెంట్లుగా పనిచేసేవారికే కాకుండా కొత్తవారైనా సరే వారికి దర్శకులుగా శంకర్ అవకాశం ఇస్తారు అనే పేరుంది ఇండస్ట్రీలో.
ఇక మరో విశేషమేమంటే.. శంకర్ చిన్న కుమార్తె అదితి శంకర్ వర్ధమాన హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. ఇండస్ట్రీలో ఆమెను ప్రోత్సహించడంలో ఒక తండ్రిగా ఆయన పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇలా ఎన్నో ప్రత్యేకతలున్న శంకర్‌ను డైరెక్టర్లకే డైరెక్టర్ అనడంలో ఏమాత్రం అతిశయోక్తి కాదు. అలాగే ఆయనను భారతీయ చిత్ర పరిశ్రమలో రియల్ గేమ్ ఛేంజర్ అని చెప్పొచ్చు.. ఇప్పటివరకూ తన సినిమాలతో అందరినీ అలరించిన శంకర్.. భవిష్యత్తులో మరిన్ని గొప్ప చిత్రాలు చేయాలనీ, మరెన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరుకుందాం..
డైరెక్టర్ శంకర్ మూవీస్ లిస్ట్..
- జెంటిల్‌మన్ (1993) – (అర్జున్ – మధుబాల)
- ప్రేమికుడు (1994) – (ప్రభుదేవా – నగ్మా)
- భారతీయుడు (1996) – (కమల్ హాసన్ – మనీషా కోయిరాలా, ఊర్మిళ, సుకన్య)
- జీన్స్ (1998) – (ప్రశాంత్ – ఐశ్వర్య రాయ్)
- ఒకే ఒక్కడు (1999) – (అర్జున్ – మనీషా కోయిరాలా)
- బాయ్స్ (2003) – (సిద్దార్థ్ – జెనీలియా)
- అపరిచితుడు (2005) – (విక్రమ్ – సదా)
- శివాజీ (2007) – (రజినీకాంత్ – శ్రియ)
- రోబో (2010) – (రజినీకాంత్ – ఐశ్వర్య రాయ్)
- స్నేహితుడు (2012) – (విజయ్ – ఇలియానా)
- ఐ (2015) – (విక్రమ్ – అమీ జాక్సన్)
- రోబో 2 (2018) – (రజినీకాంత్ – ఐశ్వర్య రాయ్, అమీ జాక్సన్, అక్షయ్ కుమార్)
- భారతీయుడు 2 (2024) – (కమల్ హాసన్ – సిద్దార్థ్, రకుల్ ప్రీత్ సింగ్)
- గేమ్ ఛేంజర్ (2025) – (రామ్ చరణ్ – కియారా అద్వానీ)
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్



మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:


























