ఆర్‌ఎఫ్‌సీలో సంక్రాంతి స్పెషల్ సాంగ్ షూట్

Sankranthiki Vasthunam Sankranthi Special Song Filmed in RFC

విక్టరీ వెంకటేష్ హైలీ యాంటిసిపేటెడ్ హోల్సమ్ ఎంటర్ టైనర్ ‘సంక్రాంతికి వస్తున్నాం’. బ్లాక్ బస్టర్ మెషిన్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. మొదటి రెండు పాటలకు చార్ట్‌బస్టర్ రెస్పాన్స్ వచ్చింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఫస్ట్ సింగల్ గోదారి గట్టు గ్లోబల్ టాప్ 20 వీడియోస్ లిస్టులో ప్రవేశించగా, సెకండ్ సింగిల్ మీను కూడా అన్ని మ్యూజిక్ చార్టులలో అగ్రస్థానంలో ఉంది. ఈ నేపథ్యంలో మేకర్స్ సంక్రాంతి స్పెషల్ సాంగ్ షూటింగ్ మేకర్స్ ప్రారంభించారు. భీమ్స్ సిసిరోలియో సంక్రాంతి ఫెస్టివల్ వైబ్ ని హైలైట్ చేసే మరో అద్భుతమైన నెంబర్ ని కంపోజ్ చేశారు.

ఆర్‌ఎఫ్‌సీలో వేసిన వైబ్రైంట్ సెట్ లో హీరో వెంకటేష్, హీరోయిన్స్ మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ పై ఈ సాంగ్ ని చిత్రీకరిస్తున్నారు. పోస్టర్‌లో వెంకటేష్ ఐశ్వర్య, మీనాక్షి, ఇతరులతో కలిసి డ్యాన్స్ చేస్తూ కనిపించారు. ఇక్కడ అందరూ సంప్రదాయ దుస్తుల్లో ఆకట్టుకున్నారు.

ఈ ఎనర్జిటిక్, కలర్‌ఫుల్ నంబర్ కు భాను మాస్టర్ కొరియోగ్రఫీ చేస్తున్నారు. ఈ సాంగ్ సినిమా మెయిన్ హైలైట్‌లలో ఒకటిగా ఉండనుంది. కాగా ఈ చిత్రంలో వెంకటేష్ ఎక్స్ పోలీస్ పాత్రలో, ఐశ్వర్య రాజేష్ అతని భార్యగా, మీనాక్షి చౌదరి ఎక్స్ లవర్ గా కనిపించనున్నారు.

దిల్ రాజు సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని శిరీష్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీని సమీర్ రెడ్డి నిర్వహిస్తుండగా, ఎఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్, తమ్మిరాజు ఎడిటర్. చిత్రానికి స్క్రీన్‌ప్లేను ఎస్ కృష్ణ, జి ఆదినారాయణ అందించగా, వి వెంకట్ యాక్షన్ సన్నివేశాలకు కొరియోగ్రఫీ చేస్తున్నారు.

కాగా ఈ మూవీలో ఉపేంద్ర లిమాయే, రాజేంద్ర ప్రసాద్, సాయి కుమార్, నరేష్, VT గణేష్, మురళీధర్ గౌడ్, పమ్మి సాయి, సాయి శ్రీనివాస్, ఆనంద్ రాజ్, చైతన్య జొన్నలగడ్డ, మహేష్ బాలరాజ్, ప్రదీప్ కబ్రా, చిట్టి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇక సంక్రాంతికి వస్తున్నాం సినిమా జనవరి 14న సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.