ఇందులో నాది చాలా స్పెషల్ అండ్ వెరీ క్యూట్ క్యారెక్టర్

Actress Amritha Aiyer Reveals Her Character in Bachhala Malli

హీరో అల్లరి నరేష్ రస్టిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘బచ్చల మల్లి’. సోలో బ్రతుకే సో బెటర్ ఫేమ్ సుబ్బు మంగాదేవి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా.. అమృత అయ్యర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ‘సామజవరగమన, ఊరు పేరు భైరవకోన’ వంటి బ్లాక్ బస్టర్స్ తర్వాత హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా, బాలాజీ గుత్తా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పటికే విడుదలై టీజర్, పాటలకు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

బచ్చల మల్లి డిసెంబర్ 20న క్రిస్మస్ సందర్భంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రీరిలీజ్ ఈవెంట్‌ని నిర్వహించారు. హీరో కిరణ్ అబ్బవరం, హీరోయిన్ సంయుక్త ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు. వీరితోపాటు దర్శకులు మారుతి, త్రినాథ్ రావు నక్కిన, వశిష్ట, విజయ్ కనకమేడల, యదు వంశీ, కార్తిక్ వర్మ దండు, బలగం వేణు అతిధులు పాల్గొన్నారు. అలాగే సినిమా టీం అంతా పాల్గొన్న ఈ వేడుక చాలా గ్రాండ్‌గా జరిగింది.

ఈ సందర్భంగా హీరోయిన్ అమృత అయ్యర్ మాట్లాడుతూ.. “అందరికీ నమస్కారం. టీజర్, ట్రైలర్‌కి వచ్చిన రెస్పాన్స్ మా టీమ్ అందరికీ చాలా స్పెషల్. ఇందులో చేస్తున్న కావేరి క్యారెక్టర్ చాలా స్పెషల్, వెరీ క్యూట్ క్యారెక్టర్. మీరందరూ ఈ క్యారెక్టర్ని చాలా ప్రేమిస్తారు. ఈ సినిమా కథ విన్నప్పుడు చాలా ఎమోషనల్‌గా అనిపించింది. డైరెక్టర్ గారు నాపై నమ్మకంతో ఈ క్యారెక్టర్ ఇచ్చారు. ఈ సందర్భంగా సుబ్బు గారికి ధన్యవాదాలు.” అని తెలిపారు.

ఇంకా ఆమె మాట్లాడుతూ.. “నిర్మాత రాజేష్ గారు మంచి కంటెంట్ వున్న సినిమాలు నిర్మిస్తుంటారు. నాకు ఈ అవకాశం ఇచ్చిన ఆయనకి థాంక్యూ. ఈ సినిమా జర్నీ చాలా అద్భుతంగా జరిగింది. నరేష్ గారు నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను. ఆయన అద్భుతమైన యాక్టర్. అన్ని రకాల వేరియేషన్స్ ని చాలా అలవోకగా చేయగలరు. ఆయనతో వర్క్ చేయడం చాలా గర్వంగా ఉంది. డిసెంబర్ 20న తప్పకుండా ఈ సినిమాని మీరు చూసి గొప్పగా ఆదరించాలని కోరుకుంటున్నాను” అని అన్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.