టాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో అడివి శేష్ మెగా పాన్-ఇండియా యాక్షన్ డ్రామా ‘డకాయిట్’ అడ్రినలిన్ పంపింగ్ ఎక్స్ పీరియన్స్ తో రూపొందుతోంది. షనైల్ డియో దర్శకత్వం వహిస్తున్న ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో సుప్రియ యార్లగడ్డ నిర్మిస్తున్నారు. సునీల్ నారంగ్ సహ నిర్మాత. ఈ చిత్రం హిందీ, తెలుగు భాషలలో ఏకకాలంలో షూట్ చేస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
అడివి శేష్, షానీల్ డియో సంయుక్తంగా కథ, స్క్రీన్ ప్లే రూపొందిచారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం మహారాష్ట్రలో లాంగ్ షెడ్యూల్‌తో కొనసాగుతుంది. ఈ రోజు తన పుట్టినరోజు సందర్భంగా, అడివి శేష్ తన లీడింగ్ లేడిని ఈ హై ఆక్టేన్ ఫేస్ ఆఫ్‌లోకి స్వాగతిస్తున్నట్లు అనౌన్స్ చేశారు. మృణాల్ ఠాకూర్ ఈ చిత్రంలో ఫీమేల్ లీడ్‌గా చేరారు.
ఇద్దరు ఎక్స్ లవర్స్ మధ్య యాక్షన్, ఎమోషన్, డ్రామాతో నిండిన కథలోకి ఎంటరవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. తన పుట్టినరోజున సినిమా అనౌన్స్మెంట్ చేసే ట్రెండ్‌కి బిన్నంగా, అడివి శేష్ తన ఫీమేల్ లీడ్ మృణాల్ ఠాకూర్‌ని అనౌన్స్ చేసి, అతని పుట్టినరోజును మరింత ప్రత్యేకంగా చేశారు. అడివి శేష్, మృణాల్ ఠాకూర్ పాత్రల మధ్య కెమిస్ట్రీని ప్రజెంట్ చేస్తూ డకోయిట్ టీం ఇంటెన్స్ పోస్టర్‌ను రిలీజ్ చేసింది.
తనకు ద్రోహం చేసిన తన ఎక్స్ లవర్ పై ప్రతీకారం తీర్చుకునే కోపంతో ఉన్న దోషి కథగా డకోయిట్ వుండబోతుంది. ప్రేమ, ద్రోహం, ప్రతీకారం పవర్ ద్వారా నడిచే తీవ్రమైన యాక్షన్ డ్రామాకు వేదికగా ఆమెను ట్రాప్ చేయడానికి అతను ప్రమాదకరమైన ప్లాన్‌ని రూపొందించాడు. అడివి శేష్, మృణాల్ ఠాకూర్లతో కూడిన రెండు కొత్త పోస్టర్లు విడుదల చేశారు. ఈ పోస్టర్స్ వారి పాత్రల ఇంటెన్స్ డైనమిక్స్‌ని ప్రజెంట్ చేస్తున్నాయి.
ఒక పోస్టర్లో, శేష్ ఫెరోషియస్‌గా కనిపించగా, మృణాల్ అతని వైపు విచారంగా చూస్తోంది. రెండవ పోస్టర్ భిన్నమైన ఇంటన్సిటీని చూపిస్తోంది. శేష్ కారులో స్టైలిష్‌గా కూర్చుని, సిగరెట్ వెలిగించగా, మృణాల్ కారు నడుపుతూ, చేతిలో తుపాకీతో కనిపించింది. రెండు పోస్టర్లు క్యారెక్టర్స్ కాంప్లెక్స్ సిటీని హైలైట్ చేస్తున్నాయి. కాగా ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను మేకర్స్ త్వరలో తెలియజేయనున్నారు.
ఇక మృణాల్ ఠాకూర్‌ను డెకాయిట్ ప్రపంచానికి స్వాగతిస్తూ, అతని పుట్టినరోజు సందర్భంగా ఈ గ్రేట్ అనౌన్స్ మెంట్ చేసిన అడివి శేష్ మాట్లాడుతూ.. “డెకాయిట్ టచ్చింగ్ లవ్ స్టొరీతో కూడిన ఇంటెన్స్ యాక్షన్ మూవీ. మృణాల్ బిగ్ స్క్రీన్‌పై కొన్ని అత్యుత్తమ పాత్రలకు జీవం పోషింది, ప్రతి పాత్రకు ఒక ప్రత్యేకతను తీసుకురావడం, ప్రతి పాత్రను ఎలివేట్ చేయడంలో ఆమె అసాధారణమైన సామర్థ్యాన్ని కలిగి ఉంది. మృనాల్‌ను డెకాయిట్ టీమ్‌కి స్వాగతిస్తున్నాను బిగ్ స్క్రీన్స్‌పై తలపడేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను” అని తెలిపారు.
అలాగే డెకాయిట్ టీమ్‌లో చేరినందుకు సంతోషించిన మృణాల్ ఠాకూర్ మాట్లాడుతూ.. “డెకాయిట్ టీమ్‌లో చేరినందుకు సంతోషిస్తున్నాను, అడివి శేష్, షానీల్ డియో స్టైలిష్ విజన్‌తో ఇంటెన్స్ కథలను బ్లెండ్ చేస్తూ డెకాయిట్ కథని అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారు. సినిమాలో నా పాత్ర యాక్టర్‌గా కొత్త కోణాలను అన్వేషించే అవకాశాన్ని అందిస్తుంది. ఆర్ట్, స్క్రిప్ట్, విజన్ కలయిక ఈ ప్రాజెక్ట్ చాలా ఎక్సయిట్మెంట్ ఇచ్చింది. షానీల్ ప్రపంచంలో భాగం కావడం ఆనందంగా వుంది” అని అన్నారు.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:


























