యూఐ లో సైకలాజికల్ కల్కి చూస్తారు – ఉపేంద్ర

Real Star Upendra Reveals Interesting Facts About UI The Movie

సూపర్ స్టార్ ఉపేంద్ర మచ్- ఎవైటెడ్ ఫ్యూచరిస్టిక్ ఎక్సట్రావగంజా ‘UI ది మూవీ’ తో అలరించడానికి సిద్ధంగా వున్నారు. లహరి ఫిల్మ్స్, జి మనోహరన్ & వీనస్ ఎంటర్‌టైనర్స్ కెపి శ్రీకాంత్ ఈ చిత్రాన్ని హై బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. నవీన్ మనోహరన్ సహా నిర్మాత. గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేయనున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సెన్సేషనల్ ప్రమోషనల్ కంటెంట్‌తో హ్యూజ్ బజ్ క్రియేట్ చేసిన ఈ చిత్రం డిసెంబర్ 20 న విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. సినిమా యూనిట్ అంతా పాల్గొన్న ప్రీరిలీజ్ ఈవెంట్ చాలా గ్రాండ్‌గా జరిగింది. ఇక ఈ వేడుకకు స్టార్ డైరెక్టర్ బుచ్చిబాబు సాన, నిర్మాత ఎస్.కే.ఎన్ అతిధులుగా హాజరయ్యారు.

ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో సూపర్ స్టార్ ఉపేంద్ర చిత్ర విశేషాలు వివరించారు. ఉపేంద్ర ఏమన్నారో ఆయన మాటల్లోనే.. “ఇక్కడ చాలా కష్టపడి ఎన్నో వెర్షన్స్ రాసి ఒక సీను తీస్తారు. ఇక్కడ చాలా నేర్చుకున్నాను. అల్లు అరవింద్ గారు ఈ సినిమాని తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. అది మాకు చాలా స్పెషల్. యూఐ సినిమా ఒక మెటఫరికల్‌గా ఉంటుంది. ఇందులో సింబాలిజం ఉంటుంది.”

“ఆడియన్స్ మీద కాన్ఫిడెన్స్‌తో ఈ సినిమాని చేశాను. ఈ సినిమాని మీరందరూ డీకోడ్ చేస్తారు. ఇది రెగ్యులర్ ఫిల్మ్ లాగా ఉండదు. ఒక కొత్త సినిమాని ఎక్స్‌పీరియన్స్ చేస్తారు. ఇది ఒక ఇమేజినరీ వరల్డ్ లా ఉంటుంది. మ్యూజిక్ డైరెక్టర్ అజినీస్, ఆర్ డైరెక్టర్ శివకుమార్, కెమెరామెన్ వేణు, ప్రజ్వల్, ఫైట్ మాస్టర్స్ రవివర్మ థ్రిల్లర్ మంజు ఇలా అందరూ వచ్చి నా విజన్ కి హెల్ప్ చేశారు.”

“రేష్మ ఎక్స్‌ట్రార్డినరీగా పెర్ఫార్మ్ చేసింది. తనకి చాలా మంచి ఫ్యూచర్ ఉంటుంది. రాంబాబు గారు అన్ని సాంగ్స్ బ్రహ్మాండంగా రాశారు. పార్థసారథి గారు ఈ సినిమాని ఒక తెలుగు సినిమాలాగే ప్రజెంట్ చేశారు. నేను చూసుకున్నప్పుడు కన్నడ ఒరిజినలా? తెలుగు ఒరిజినలా? అనే డౌట్ వచ్చంది. ఇలా అందరూ కలిసి ఈ సినిమాని ఒక అద్భుతంగా మార్చారు.”

“కల్ట్ అనేది ఆడియన్స్‌ లోనే ఉంది. నా ధైర్యం మీరే. సినిమా ఓపెనింగ్ నుంచే షాక్ అవుతారు. మీరు మైథలాజికల్ కల్కి చూశారు. ఇందులో సైకలాజికల్ కల్కి చూస్తారు. ఖచ్చితంగా ఈ సినిమా ఆడియన్స్ కి ఓ కొత్త ఎక్స్ పీరియన్స్ ఇస్తుంది. అందరికీ థాంక్ యూ” అని అన్నారు హీరో ఉపేంద్ర.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.