గేమ్ ఛేంజర్.. నెక్స్ట్ సాంగ్ అప్‌డేట్

Game Changer Next Song Update

గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ క‌థానాయ‌కుడిగా స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన భారీ బ‌డ్జెట్ చిత్రం ‘గేమ్ ఛేంజర్’. చ‌ర‌ణ్ రెండు ప‌వ‌ర్‌ఫుల్ పాత్ర‌ల్లో కనిపించనున్నారు. శ్రీమ‌తి అనిత స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మించారు. ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని మెగా అభిమానులు, సినీ ప్రియులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ప‌క్కా ప్ర‌మోష‌న‌ల్ స్ట్రాట‌జీతో సినిమాపై అంచ‌నాలు రోజు రోజుకీ పెరుగుతున్నాయి. ఈ ఎక్స్‌పెక్టేష‌న్స్‌కు నెక్ట్స్ రేంజ్‌లో సినిమా ఉండేలా డైరెక్ట‌ర్ శంక‌ర్ తుది మెరుగులు దిద్దుతున్నారు. ఇప్పటికే గేమ్ ఛేంజర్ చిత్రం నుంచి వచ్చిన మూడు పాటలు సోషల్ మీడియాను షేక్ చేశాయి. ‘జరగండి, రా మచ్చా, నానా హైరానా’ పాటలు యూట్యూబ్‌లో చార్ట్ బస్టర్‌లుగా నిలిచాయి. ఇక మరోసారి శ్రోతల్ని, అభిమానుల్ని కట్టి పడేసేందుకు చిత్ర యూనిట్ సిద్ధంగా ఉంది.

ఈ నేపథ్యంలో తదుపరి పాటకు సంబంధించి ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ పంచుకుంది చిత్ర బృందం. ఈ మేరకు ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్న ఎస్‌.ఎస్‌.త‌మ‌న్ తాజాగా సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. గేమ్ ఛేంజర్ నుండి త్వరలోనే మరోపాట వస్తోందని తెలిపిన ఆయన, ఈ సాంగ్ గురించి ప్రపంచం అంతా మాట్లాడుకుంటుందని చెప్పారు. దీంతో ఈ పాట ఎప్పుడు వస్తుందా అని ఇప్పటినుంచే అభిమానులు ఎదురుచూస్తున్నారు.

గేమ్ ఛేంజర్‌కు కార్తీక్ సుబ్బరాజ్ కథను అందించగా.. సాయి మాధ‌వ్ బుర్రా డైలాగ్స్ రాశారు. ఎస్‌.తిరుణ్ణావుక్క‌ర‌సు సినిమాటోగ్ర‌ఫీ, అవినాష్ కొల్ల‌ ఆర్ట్ అందిస్తున్నారు. యాక్ష‌న్ కొరియోగ్రాఫ‌ర్స్‌గా అన్బ‌రివు, డాన్స్ డైరెక్ట‌ర్‌గా ప్ర‌భుదేవా, గ‌ణేష్ ఆచార్య‌, ప్రేమ్ రక్షిత్‌, బాస్కో మార్టిస్, జానీ, శాండీ వ‌ర్క్ చేస్తున్నారు. రామ్ జోగ‌య్య శాస్త్రి, అనంత్ శ్రీరామ్‌, కాసర్ల శ్యామ్ పాట‌ల‌ను రాశారు. సరిగమ ద్వారా గేమ్ చేంజర్ ఆడియో రిలీజ్ అవుతోంది.

సమకాలీన రాజకీయ అంశాల నేపథ్యంలో రూపొందుతోన్న ఈ సినిమాలో శ్రీకాంత్, ఎస్‌జే సూర్య, జయరామ్, సునీల్‌, అంజలి, నవీన్ చంద్ర తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇక ఈ చిత్రాన్ని నార్త్ అమెరికాలో శ్లోకా ఎంటర్టైన్మెంట్స్ భారీ ఎత్తున రిలీజ్ చేయనుంది. అలాగే ఎస్‌వీసీ, ఆదిత్య‌రామ్ మూవీస్ సంస్థ‌లు త‌మిళంలో విడుద‌ల చేస్తుండగా.. హిందీలో ఏఏ ఫిలిమ్స్ అనిల్ తడాని రిలీజ్ చేస్తున్నారు. ఇక గేమ్ ఛేంజర్ ప్రపంచవ్యాప్తంగా సంక్రాంతి కానుకగా జనవరి 10న విడుదలకానుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.