ఎల్2 ఎంపురాన్ నుండి.. పృథ్వీరాజ్ ఫస్ట్ లుక్‌ రిలీజ్

Mohanlal Released Prithviraj Sukumaran's First Look From L2 Empuraan

మాలీవుడ్ సూపర్ స్టార్ మోహన్‌ లాల్‌ ప్రస్తుతం వరుస చిత్రాల్లో నటిస్తున్నారు. వీటిలో మోస్ట్ క్రేజీఎస్ట్ ప్రాజెక్ట్‌ ‘ఎంపురాన్’. ఈ చిత్రానికి స్టార్ హీరో, ‘సలార్’ ఫేమ్ పృథ్వీరాజ్ సుకుమారన్‌ దర్శకత్వం వహిస్తుండటం విశేషం. గతంలో వీరి కాంబోలోనే వచ్చిన ‘లూసిఫర్’ చిత్రానికి సీక్వెల్ గా ఇది రూపొందుతోంది. కాగా ఇందులో పృథ్వీరాజ్ సుకుమారన్‌ ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అలాగే మంజు వారియర్, టోవినో థామస్ మరియు ఇంద్రజిత్ సుకుమారన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ ఏడాది మే 21న మోహన్ లాల్ జన్మదినం సందర్భంగా ఆయన క్యారక్టర్‌కి సంబంధించిన ఖురేషి అబ్ర‌మ్‌ ఫస్ట్‌ లుక్‌ను రివీల్ చేశారు మేకర్స్‌. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ నుంచి మరో ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ వచ్చింది. నేడు పృథ్వీరాజ్ సుకుమారన్‌ పుట్టినరోజు జరుపుకుంటున్నారు.

దీనిని పురస్కరించుకుని చిత్ర యూనిట్ ఎంపురాన్ నుండి పృథ్వీరాజ్ ఫస్ట్‌ లుక్‌ పోస్టర్ రిలీజ్ చేసింది. ఈ మేరకు హీరో మోహన్‌ లాల్‌ తన అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా బుధవారం పృథ్వీరాజ్ ఫస్ట్‌ లుక్‌ రివీల్ చేశారు. పృథ్వీరాజ్ కమెండో డ్రెస్ లో బ్లాక్ గాగుల్స్‌ పెట్టుకుని, చేతిలో గన్‌ పట్టుకుని గంభీరంగా ఉన్న ఈ పోస్టర్ సినిమాపై అంచనాలను పెంచేలావుంది. ప్రస్తుతం ఈ లుక్‌ నెట్టింట ట్రెండింగ్‌ అవుతోంది.

కాగా ‘ఎంపురాన్’ తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో వరల్డ్‌వైడ్‌గా గ్రాండ్‌గా విడుదల కానుంది. మరోవైపు మోహన్ లాల్ తెలుగు, మలయాళ బైలింగ్యువల్‌ ప్రాజెక్ట్‌ ‘వృషభ’లో నటిస్తున్నారు. ఈ చిత్రంలో టాలీవుడ్ యువ నటుడు రోషన్‌ కీలక పాత్ర పోషిస్తున్నాడు. అలాగే పీరియాడిక్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన మలైకోటై వాలిబన్ సీక్వెల్‌లో కూడా నటిస్తున్నారు. వీటితోపాటు ‘రామ్: పార్ట్ 1’, ‘రామ్: పార్ట్ 2’ సినిమాలలో నటిస్తున్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.