క.. రిలీజ్ డేట్ ఫిక్స్

Kiran Abbavaram's KA Release Date Fix

టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం సుమారు ఏడాది గ్యాప్ తర్వాత హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘క’ (కిరణ్ అబ్బవరం). సుజీత్-సందీప్ ద్వయం దర్శకత్వంలో పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో నయన్‌ సారిక, తన్వీరామ్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం చిత్రీకరణ దశలో ఉంది. ఇక ఈ సినిమా నుండి ఇప్పటికే టీజర్ రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ నేపథ్యంలో మేకర్స్ మూవీ మ్యూజికల్ ప్రమోషన్స్‌ను కూడా మొదలుపెట్టేశారు. దీనిలో భాగంగా ‘క’ నుంచి ఫస్ట్ సింగిల్‌ను రిలీజ్ చేయగా సూపర్ రెస్పాన్స్ అందుకుంది. కాగా సామ్ సీఎస్ బ్యూటిఫుల్ కంపోజిషన్‌లో వస్తున్న ఈ సాంగ్స్ మ్యూజిక్ లవర్స్‌ను మెస్మరైజ్ చేయబోతున్నాయి. ఈ క్రమంలో తాజాగా క నుంచి సాలిడ్ అప్డేట్ పంచుకుంది చిత్ర యూనిట్. దసరా కానుకగా ఈనెల 31న క చిత్రాన్ని రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించింది.

శ్రీ చక్రాస్‌ ఎంటర్‌టైన్‌ మెంట్‌ పతాకంపై నిర్మాత చింతా గోపాలకృష్ణా రెడ్డి నిర్మిస్తున్న ఈ మూవీ గ్రామీణ నేపథ్యంలో పీరియాడిక్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌గా రూపొందుతోంది. మరోవైపు ఈ సినిమాకు సంబంధించిన మలయాళ థియేట్రికల్‌ హక్కులను స్టార్ హీరో దుల్కర్‌ సల్మాన్‌ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.

ఇక ఈ సినిమాకు విశ్వాస్ డానియేల్, సతీష్ రెడ్డి మాసం సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. సామ్ సీఎస్ సంగీతం సమకూరుస్తున్నారు. శ్రీ వరప్రసాద్ ఎడిటర్‌గా పనిచేస్తున్న ఈ చిత్రం త్వరలో తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కాబోతుంది. కిరణ్ అబ్బవరం కెరీర్‌లో తొలి పాన్ ఇండియా చిత్రంగా రూపొందుతుండటంతో దీనిపై భారీ అంచనాలే ఉన్నాయి.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.