ఈ సినిమా బొమ్మరిల్లులా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది

Director Vassishta Says, Janaka Aithe Ganaka to be Block Buster Hit Like Bommarillu

వెర్సటైల్ యాక్ట‌ర్ సుహాస్‌, సంగీర్త‌న హీరో హీరోయిన్లుగా ‘జనక అయితే గనక’ చిత్రాన్ని సందీప్‌ రెడ్డి బండ్ల తెరకెక్కించారు. శిరీష్ సమర్పణలో దిల్‌రాజు ప్రొడక్షన్స్ పతాకంపై ఈ చిత్రాన్ని హర్షిత్‌ రెడ్డి, హన్షిత రెడ్డి నిర్మించారు. ద‌స‌రా సంద‌ర్భంగా ‘జనక అయితే గనక’ అక్టోబ‌ర్ 12న విడుద‌ల కానుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇప్పటి వరకు చిత్రం నుంచి రిలీజ్ చేసిన పోస్టర్లు, పాటలు, టీజర్‌, ట్రైలర్ అన్నీ కూడా పాజిటివ్ వైబ్‌ను క్రియేట్ చేశాయి. ఆల్రెడీ చాలా చోట్ల ప్రీమియర్లు వేయడంతో మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ చిత్రయూనిట్ గురు వారం నాడు ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి డైరెక్టర్ బలగం వేణు, వశిష్టలు ముఖ్య అతిథులుగా విచ్చేశారు.

ఈ సందర్భంగా డైరెక్టర్ వశిష్ట మాట్లాడుతూ.. ‘ఇది ప్రీ రిలీజ్ ఈవెంట్‌లా లేదు.. సక్సెస్ మీట్‌లా ఉంది. నేను ఆల్రెడీ మూవీని తీశాను. ఇంత సెన్సిటివ్ పాయింట్‌ను, ఎక్కడా అసభ్యతకు తావు లేకుండా అద్భుతంగా చేశారు. ఇలాంటి పాయింట్‌ను మాట్లాడేందుకు సిగ్గు పడతారు. కానీ అద్భుతంగా తీశారు. మనకు జరిగిందే స్క్రీన్ మీద కనిపిస్తోంది కదా? అని అందరూ కనెక్ట్ అవుతారు.” అని తెలిపారు.

ఇంకా ఆయన మాట్లాడుతూ.. “స్కూల్ ఫీజ్‌లు, హాస్పిటల్ ఖర్చులు ఇలా ప్రతీ ఒక్కరికీ కనెక్ట్ అవుతుంది. దిల్ రాజు బ్యానర్‌‌లో వచ్చిన బొమ్మరిల్లు రేంజ్‌లో ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. హీరోగా, డిస్ట్రిబ్యూటర్‌గా సుహాస్‌కు కంగ్రాట్స్. హర్షిత, హన్షిత్‌లు బలగం పార్టీనే నాకు ఇంకా ఇవ్వలేదు. ఈ మూవీది ఇంకా బ్యాలెన్స్ ఉంది (నవ్వుతూ)” అని అన్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.