ఈ చిత్రాన్ని మీడియానే జనాల వద్దకు తీసుకెళ్లాలి

Dil Raju Wants Media Support For Janaka Aithe Ganaka To Reach Audience

వెర్సటైల్ యాక్ట‌ర్ సుహాస్‌, సంగీర్త‌న హీరో హీరోయిన్లుగా ‘జనక అయితే గనక’ చిత్రాన్ని సందీప్‌ రెడ్డి బండ్ల తెరకెక్కించారు. శిరీష్ సమర్పణలో దిల్‌రాజు ప్రొడక్షన్స్ పతాకంపై ఈ చిత్రాన్ని హర్షిత్‌ రెడ్డి, హన్షిత రెడ్డి నిర్మించారు. ద‌స‌రా సంద‌ర్భంగా ‘జనక అయితే గనక’ అక్టోబ‌ర్ 12న విడుద‌ల కానుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇప్పటి వరకు చిత్రం నుంచి రిలీజ్ చేసిన పోస్టర్లు, పాటలు, టీజర్‌, ట్రైలర్ అన్నీ కూడా పాజిటివ్ వైబ్‌ను క్రియేట్ చేశాయి. ఆల్రెడీ చాలా చోట్ల ప్రీమియర్లు వేయడంతో మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ చిత్రయూనిట్ గురు వారం నాడు ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి డైరెక్టర్ బలగం వేణు, వశిష్టలు ముఖ్య అతిథులుగా విచ్చేశారు.

ఈ కార్యక్రమంలో నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ.. “నా 21 ఏళ్ల సినీ కెరీర్‌లో ఎంతో మంది దర్శకుల్ని పరిచయం చేశాను. దిల్ రాజు ప్రొడక్షన్స్ ద్వారా చిన్న చిత్రాలను, కొత్త టాలెంట్‌ను తీసుకు రావాలని అనుకున్నాం. అలా బలగం వచ్చింది. ఇప్పుడు సందీప్, ఆ తరువాత శశి వస్తున్నాడు. చిన్న చిత్రాన్ని ఆడియెన్స్ వద్దకు తీసుకెళ్లడం చాలా కష్టం. ఓ సినిమాను నమ్మి, బాగా వచ్చిందని అనుకున్నా.. ఆడియెన్స్ వరకు తీసుకెళ్లడం కష్టం” అని తెలిపారు.

ఇంకా ఆయన మాట్లాడుతూ.. “అందుకే బలగంలా రిలీజ్‌కు ముందే చాలా మందికి చూపించాం. ఈ క్రమంలోనే మీడియాకి కూడా చూపించాం. మీడియా నుంచి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. అంటే పాస్ అయ్యాం. కానీ ఆడియెన్స్‌ని థియేటర్లకు ఎలా రప్పించాలి అనేది పెద్ద టాస్క్. అసలే దసరా సందర్భంగా చాలా చిత్రాలు వస్తున్నాయి. వస్తున్న ఆరేడు చిత్రాల్లో ఇలాంటి మంచి చిత్రం వచ్చినప్పుడు.. మీడియానే ముందుకు తీసుకెళ్లాల్సి ఉంటుంది.” అని పేర్కొన్నారు.

అలాగే దిల్ రాజు ఇంకా ఇలా అన్నారు.. “ఇలాంటి చిన్న చిత్రాలు తీయాలనే ఆత్రుత, భయం రెండూ ఉంటాయి. చిన్న చిత్రాలతోనే ఎక్కువ టాలెంట్ బయటకు వస్తుంది. ఈ చిత్రం బాగా ఆడితేనే టెక్నీషియన్లు, ఆర్టిస్టులకు మంచి పేరు, ఆఫర్లు వస్తాయి. ఆద్యంతం నవ్వించేలా ఉందని అందరూ చెబుతున్నారు. ఇలాంటి మంచి సినిమాను మీడియానే ముందుకు తీసుకెళ్లాలి. అక్టోబర్ 12న మా చిత్రం రాబోతోంది. అందరూ చూడండి” అని అన్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.