క నుండి వీడియో సాంగ్ రిలీజ్

mass jathara video song out from ka movie

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నుండి వస్తున్న నెక్స్ట్ సినిమా క.కిరణ్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతుంది.రీసెంట్ గా విడుదలైన టీజర్,ఫస్ట్ సాంగ్ కు హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది.దాంతో క పై అంచనాలు ఏర్పడ్డాయి.ఇది పాన్ ఇండియా మూవీ గా విడుదలకానుంది.ఇక ఈసినిమా నుండి నిన్న జాతర వీడియో సాంగ్ ను రిలీజ్ చేశారు.సాంగ్ లో కిరణ్ స్టెప్స్ ఆకట్టుకున్నాయి.సాంగ్ చిత్రీకరణ కూడా చాలా గ్రాండియర్ గా వుంది.ఓవరాల్ గా ఇప్పటివరకు అయితే వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ ప్రామిసింగ్ గా వుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక రీసెంట్ గా సినిమా షూట్ కంప్లీట్ కాగా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ లో వుంది.అన్ని కుదిరితే అక్టోబర్ 31న రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.థియేట్రికల్ రైట్స్ కూడా మంచి డిమాండ్ వుంది.అందులో భాగంగా తెలుగు రైట్స్ ను వంశీ నందిపాటి తీసుకోగా మలయాళ థియేట్రికల్ రైట్స్ ను స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ ప్రొడక్షన్ కంపెనీ వేఫరర్ ఫిలింస్ సొంతం చేసుకుంది.మలయాళంలో క సినిమాను వరల్డ్ వైడ్ గా ఈ సంస్థ థియేట్రికల్ రిలీజ్ చేయనుంది.

సుజీత్,సందీప్ డైరెక్ట్ చేస్తున్న ఈసినిమాలో ఆయ్ ఫేమ్ నయన్ సారిక అలాగే తన్వీ రామ్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.సామ్ సీఎస్ సంగీతం అందిస్తున్నాడు.చింతా గోపాలకృష్ణ రెడ్డి భారీ ప్రొడక్షన్ వ్యాల్యూస్ తో నిర్మిస్తున్నారు.

ఇక ఈసినిమాతో భారీ హిట్ కొట్టి ఫామ్ లోకి రావాలని చూస్తున్నాడు కిరణ్ అబ్బవరం.కెరీర్ స్టార్టింగ్ లో వరుస విజయలతో దూసుకెళ్లిన ఈహీరో ఆ తరువాత తడబడ్డాడు.అయితే ఈసారి క తనకు కావాల్సిన విజయాన్ని అందిస్తుందని చాలా కాన్ఫిడెంట్ గా వున్నాడు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.