అనన్య నాగళ్ల పొట్టేల్ రిలీజ్ డేట్ కన్ఫర్మ్

Ananya Nagalla's Pottel Movie Release Date Confirmed

తెలుగమ్మాయి అనన్య నాగళ్ల మరియు యంగ్ అండ్ ట్యాలెంటెడ్ హీరో యువ చంద్ర కృష్ణ లీడ్ రోల్స్‌లో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘పొట్టేల్’. సాహిత్ మోత్ఖూరి దర్శకత్వంలో రూరల్ బ్యాక్ డ్రాప్‌లో సాగే ఫ్రెష్ అండ్ హానెస్ట్ నొవల్ కాన్సెప్ట్ చిత్రంగా తెరకెక్కుతోంది. ఈ సినిమాకు శేఖర్ చంద్ర కంపోజ్ చేసిన ఆల్బమ్ సూపర్‌హిట్ అయ్యింది. ఇప్పటివరకూ విడుదలైన పాటలన్నీ చార్ట్ బస్టర్ అయ్యాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కొన్ని రోజుల క్రితం స్టార్ డైరెక్టర్ సందీప్‌ రెడ్డి వంగా విడుదల చేసిన టీజర్‌ సంచలనం సృష్టించింది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా దసరా కానుకగా పొట్టేల్ థియేటర్లలోకి రానున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. ఈ సందర్భంగా బ్యాక్‌గ్రౌండ్‌లో జాతీయ జెండా ఉండగా, లీడ్ క్యారెక్టర్స్ యువ చంద్ర కృష్ణ, అనన్య నాగళ్ల, వారి పాప, పొట్టేల్ కనిపించిన రిలీజ్ డేట్ పోస్టర్‌ ఆకట్టుకుంది.

ఈ నేపథ్యంలో తాజాగా పొట్టేల్ రిలీజ్ డేట్ కన్ఫర్మ్ చేశారు మేకర్స్. అక్టోబర్ 25న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. కాగా తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాకి దసరా పర్ఫెక్ట్ రిలీజ్ టైం. దసరా తెలంగాణలో అతిపెద్ద పండుగ. సినిమాకి హాలిడేస్ అడ్వాంటేజ్‌ వుంటుంది.

కాగా పొట్టేల్ మూవీలో అజయ్, ప్రియాంక శర్మ, తనస్వి చౌదరి, నోయల్ సీన్, చత్రపతి శేఖర్, శ్రీకాంత్ అయ్యంగార్, జీవన్, రియాజ్, విక్రమ్ తదితరులు నటిస్తున్నారు. ఇక ఈ చిత్రానికి మోనిష్ భూపతి రాజు సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. కార్తీక శ్రీనివాస్ ఎడిటర్‌గా, నార్ని శ్రీనివాస్ ఆర్ట్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. నిసా ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై నిశాంక్ రెడ్డి కుడితి, ప్రజ్ఞ సన్నిధి క్రియేషన్స్‌పై సురేష్ కుమార్ సడిగే పొట్టేల్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.