ఎన్టీఆర్ దేవర మరో మూడు రోజుల్లో థియేటర్లలోకి రానుంది.ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో దేవర మానియా స్టార్ట్ అయ్యింది.అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ కాగా షోస్ అన్ని ఫుల్ అవుతున్నాయి.రేపటి లోగా పూర్తి స్థాయిలో బుకింగ్స్ ఓపెన్ కానున్నాయి.రెండు రాష్ట్రాల్లో టిక్కెట్ హైక్స్ ,ఎక్స్ట్రా షోలకు పర్మిషన్లు వచ్చాయి.సోలో గా రిలీజ్ అవుతుండడం అలాగే దసరా సెలవులు అడ్వాంటేజ్ కానున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఓవర్సీస్ లో దేవర హావ కొనసాగుతుంది.ఇప్పటికే ప్రీమియర్స్ ప్రీ సేల్స్ 3మిలియన్ డాలర్ మార్క్ ను దాటేశాయి.దాంతో కేవలం ప్రీ సేల్స్ తోనే అరవింద సమేత లైఫ్ టైం కలెక్షన్స్ ను దాటేసింది.ఇంతకుముందు అరవింద సమేత 3.2 మిలియన్ డాలర్ వసూళ్లను రాబట్టింది.హిట్ టాక్ వస్తే దేవర మొదటి వారాంతం లో 5మిలియన్ మార్క్ ను క్రాస్ చేయనుంది.అటు నార్త్ అమెరికాలో ప్రీ సేల్స్ 2 మిలియన్ మార్క్ ను క్రాస్ చేశాయి.
ఓవరాల్ గా దేవర మొదటి రోజు అన్ని భాషల్లో కలిపి 100కోట్లకు పైగా వసూళ్లను రాబట్టుకోనుంది.ఎన్టీఆర్ కెరీర్ లో సోలో హీరోగా దేవర బిగ్గెస్ట్ ఓపెనర్ గా రికార్డు సృష్టించనుంది.కొరటాల శివ డైరెక్షన్ లో హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ తెరకెక్కిన ఈసినిమాలో ఎన్టీఆర్ డ్యూయెల్ రోల్ లో కనిపించనుండగా అనిరుధ్ సంగీతం అందించాడు.యువసుధ ఆర్ట్స్,ఎన్టీఆర్ ఆర్ట్స్ నిర్మించాయి.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























