VD 12 నుంచి త్వరలో ఇంట్రెస్టింగ్ అప్‌డేట్

Vijay Deverakonda Gives Interesting Update About VD12

టాలీవుడ్ క్రేజీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘VD 12’ (వర్కింగ్ టైటిల్). ‘జెర్సీ’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్నాడు. విజయ్ ఫ్యాన్స్ VD 12 గురించి అప్‌డేట్స్ ఎప్పుడెప్పుడు వస్తాయా అని తెగ ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో హీరో విజయ్ దేవరకొండ దీనిపై స్పందించాడు. VD 12 నుంచి త్వరలోనే ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ ఇస్తాం అని తెలిపాడు. ఈ మేరకు సైమా హ్యపీ మూమెంట్స్‌ను తన లేటెస్ట్ ట్వీట్‌లో పోస్ట్ చేసిన విజయ్.. అందులో VD 12పై కూడా స్పందించాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అయితే రీసెంట్‌గా దుబాయ్‌లో జరిగిన సైమా అవార్డ్స్ వేడుకల్లో విజయ్ దేవరకొండ ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. విజయ్ తమ్ముడు, హీరో ఆనంద్ దేవరకొండకు ‘బేబి’ సినిమాకు గాను బెస్ట్ యాక్టర్ క్రిటిక్ అవార్డ్ దక్కింది. అలాగే ‘అర్జున్ రెడ్డి’ ఫేమ్ సందీప్ రెడ్డి వంగా సెన్సేషన్ ఆఫ్ ది ఇయర్‌గా అవార్డ్ అందుకున్నారు. ఈ అవార్డ్స్ ప్రెజెంటేషన్ తర్వాత సందీప్ వంగా, ఆనంద్ దేవరకొండతో హ్యాపీ మూవ్ మెంట్స్ షేర్ చేసుకున్నారు విజయ్ దేవరకొండ.

ఈ ఫొటోస్ ఈ రోజు ఎక్స్ (ట్విట్టర్)లో షేర్ చేశాడు. ఈ ట్వీట్ లో విజయ్ దేవరకొండ స్పందిస్తూ – నాకు ఇష్టమైన డైరెక్టర్ సందీప్ వంగాకు సైమా సెన్సేషన్ అవార్డ్ రావడాన్ని సెలబ్రేట్ చేసుకున్నా అలాగే మా బ్రదర్ ఆనంద్ దేవరకొండకు బెస్ట్ యాక్టర్ క్రిటిక్ అవార్డ్ రావడం గర్వంగా సంతోషంగా ఉంది. త్వరలోనే VD 12 మూవీ అప్డేడ్ ఇవ్వబోతున్నాం” అని పేర్కొన్నాడు. కాగా విజయ్ దేవరకొండ లేటెస్ట్ ట్వీట్ నెటిజన్స్ దృష్టిని బాగా ఆకర్షిస్తోంది.

ఇక VD 12 చిత్రాన్ని టాప్ ప్రొడక్షన్ హౌస్ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ మరియు స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ హోం బ్యానర్ ఫార్చ్యూన్ 4 సినిమాస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. గ్యాంగ్‍స్టర్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు. ఇక ఈ మూవీలో నటించనున్న హీరోయిన్ అలాగే ఇతర నటీనటుల వివరాలను త్వరలోనే తెలియజేయనున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.