సుందరకాండ ఫస్ట్ సింగిల్ రిలీజ్ 

Bahusa Bahusa song From Sundarakanda is Out Now

ప్రతినిధి 2 తరువాత యంగ్ హీరో నారా రోహిత్ నటిస్తున్న 20వ సినిమా సుందరకాండ.రీసెంట్ గా ఈసినిమా నుండి వచ్చిన టీజర్ ప్రామిసింగ్ గా అనిపించి సినిమాపై ఆసక్తిని క్రీయేట్ చేసింది.ఇక ఇప్పుడు ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేశారు.బహుశా బహుశా అంటూ సాగే ఈ పాట బాగుంది.ప్రముఖ సింగర్ సిద్ శ్రీరామ్ వోకల్స్ సాంగ్ కు ఫ్రెష్ నెస్ తీసుకొచ్చింది.తెలుగులో చాలా రోజుల తరువాత తన వాయిస్ వినిపించింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

  హీరోకి మ్యారేజ్ ఏజ్ దాటినా ఐదు లక్షణాలు కలిగి ఉన్న పార్ట్నర్ కోసం సెర్చ్ చేయడం తన కోసం అమ్మాయిని వెతికి పేరెంట్స్ కూడా  విసిగిపోవడం మరి ఈ పరిస్థితుల్లో  హీరో అనుకున్నది సాధించాడా లేదా అనే సబ్జెక్టు తో వస్తుంది ఈసినిమా.ఇందులో వృతి వాఘని,ఈశ్వర్ ఫేమ్ శ్రీ దేవి విజయ్ కుమార్ హీరోయిన్లు గా నటిస్తుండగా నరేష్, వాసుకి ఆనంద్,సత్య,అభినవ్ గోమఠం కీలక పాత్రల్లో కనిపించనున్నారు. 

కొత్త  దర్శకుడు వెంకటేష్ నిమ్మలపూడి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈసినిమాకు లియోన్ జేమ్స్ సంగీతం అందిస్తుండగా సందీప్ పిక్చర్ ప్యాలెస్ బ్యానర్ పై సంతోష్ చిన్నపొల్ల,గౌతమ్ రెడ్డి,రాకేష్ మహంకాళి నిర్మిస్తున్నారు.వచ్చే నెల లో రిలీజ్ చేసేలా సన్నాహాలు చేస్తున్నారు.ఇక చాలా గ్యాప్ తరువాత ప్రతినిధి 2 వచ్చిన  నారా  రోహిత్ కు ఆ ఆసినిమా విజయాన్ని అందించలేకపోయింది.మరి సుందరకాండతో అయినా హిట్ కొట్టి  ఫామ్ లోకి వస్తాడో చూడాలి. 

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.