మాలీవుడ్ స్టార్ హీరో టోవినో థామస్ మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా పాంటసీ ప్రాజెక్ట్ ‘ARM’తో ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేయడానికి సిద్ధంగా వున్నారు. టోవినో థామస్ 50వ మైల్ స్టోన్ మూవీగా వస్తున్న ఈ చిత్రంలో కృతి శెట్టి, ఐశ్వర్య రాజేష్, సురభి లక్ష్మి కథానాయికలుగా నటిస్తున్నారు. డాక్టర్ జకారియా థామస్‌తో కలిసి మ్యాజిక్ ఫ్రేమ్స్, UGM మోషన్ పిక్చర్స్ బ్యానర్లపై లిస్టిన్ స్టీఫెన్ నిర్మించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
డెబ్యుటెంట్ జితిన్ లాల్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్‌కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రాన్ని తెలుగులో మైత్రీ మూవీ మేకర్స్ డిస్ట్రిబ్యూటర్స్ గ్రాండ్‌గా విడుదల చేస్తున్నారు. కాగా ARM సెప్టెంబర్ 12న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ తాజాగా హైదరాబాద్‌లో ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించింది.
ఈ సందర్భంగా హీరోయిన్ కృతి శెట్టి మాట్లాడుతూ.. “ఇప్పటివరకూ ముంబై, చెన్నై, కర్ణాటక, కేరళలో ప్రమోట్ చేశాం. ఇప్పుడు హైదరాబాద్‌లో ప్రమోట్ చేయడం మళ్ళీ ఇంటికి వచ్చినట్లు వుంది. ఇది మంచి సినిమా. ఒక మంచి సినిమాని తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ సపోర్ట్ చేస్తారనే నమ్మకం వుంది. చాలా అద్భుతమైన కథ ఇది. జితిన్ ఈ సినిమా కోసం ఎనిమిదేళ్ళుగా కష్టపడ్డారు. సినిమాని అద్భుతంగా తీశారు. నన్ను తెలుగులో పరిచయం చేసిన మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాని తెలుగులో విడుదల చేయడం చాలా ఆనందంగా వుంది” అని తెలిపారు.
ఇంకా ఆమె మాట్లాడుతూ.. “టోవినో థామస్ ఈ జనరేషన్ లో గ్రేట్ యాక్టర్. ఈ సినిమా కోసం ఒక యాక్టర్ ట్రైనీని కూడా తీసుకున్నారు. ఆయన నుంచి చాలా నేర్చుకున్నాను. ఇందులో హరీష్ గారి పాత్రని ఆడియన్స్ చాలా ఎంజాయ్ చేస్తారు. ఐశ్వర్య రాజేష్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేశారు. సురభి లక్ష్మి అవుట్ స్టాండింగ్ రోల్ చేశారు. రోహిణీ మేడంతో పని చేయడం మెమరబుల్. మలయాళంలో ఈ సినిమా నా డెబ్యూ. అందరి సపోర్ట్‌తో ఈ జర్నీ అద్భుతంగా జరిగింది. ఈ సినిమా త్రీడీలో వస్తుంది. తప్పకుండా అందరూ సినిమా చూసి ఎంజాయ్ చేయండి” అని కోరారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: