ఓటీటీలో కల్కి సంచలనం.. గ్లోబల్ వైడ్‌గా ట్రెండింగ్

Kalki 2898 AD Trending Global Wide on OTT With Over 4 Million Views

పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘కల్కి 2898 AD’. క్రియేటివ్ ఫిల్మ్ మేకర్ నాగ్ అశ్విన్ గ్రాండ్ స్కేల్‌పై ఫ్యూచరిస్టిక్ ఎపిక్ మైథలాజికల్ డ్రామాగా తెరకెక్కించారు. వైజయంతీ మూవీస్‌ బ్యానర్‌పై స్టార్ ప్రొడ్యూసర్‌ అశ్వనీదత్‌ భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కల్కి చిత్రం జూన్ 27న వరల్డ్ వైడ్‍గా రిలీజైన సంగతి గుర్తుండేవుంటుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

విజువల్ వండర్‌గా రూపొందిన ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. దీంతో బాక్సాఫీస్ వద్ద రూ.1200 కోట్లకు పైగా వసూళ్లు సాధించి ఔరా అనిపించింది. ఈ క్రమంలో దేశ, విదేశాల్లో పలు రికార్డులను బద్దలు కొట్టిన కల్కి ఆగస్ట్ 22న ఓటీటీలోకి వచ్చిన విషయం తెలిసిందే. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగు సహా అన్ని దక్షిణాది భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది.

ఇక కల్కి హిందీ వెర్షన్ మాత్రం మరో దిగ్గజ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం అవుతోంది. ఈ నేపథ్యంలో ప్రభాస్ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో సంచలనం సృష్టిస్తోంది. 4.5 మిలియన్ల వ్యూస్‌తో దూసుకుపోతూ గ్లోబల్ వైడ్‌గా ట్రెండింగ్ అవుతోంది. కాగా గత వారానికిగానూ (ఆగస్ట్ 19 – ఆగస్ట్ 25) ఈ లిస్ట్ రిలీజ్ చేయగా.. అందులో కేవలం 4 రోజుల్లోనే రెండో స్థానానికి దూసుకెళ్లడం విశేషం.

ఇక తొలి స్థానంలో 5 మిలియన్ల వ్యూస్‌తో ‘ఐ కెన్ నాట్ లివ్ వితౌట్ యూ’ అనే సినిమా ఉంది. గడిచిన రెండు వారాలుగా ఆ సినిమా టాప్‌లో ఉండటం గమనార్హం. నెట్‌ఫ్లిక్స్ ఇండియా ట్రెండింగ్ మూవీస్‌లో మాత్రం కల్కి 2898 ఏడీ అగ్రస్థానంలో ఉంది. ఈ వారం మాత్రం గ్లోబల్ ట్రెండింగ్స్ లోనూ టాప్ ప్లేస్ లోకి వెళ్లే అవకాశాలు ప్రస్ఫూటంగా కనిపిస్తున్నాయి. దీంతో ఈ సినిమా ఈ వారంలో మరిన్ని రికార్డు వ్యూస్ సొంతం చేసుకునే అవకాశం ఉంది.

మరోవైపు అమెజాన్ ప్రైమ్ వీడియోలోనూ కల్కి తెలుగు వెర్షన్ అదరగొడుతోంది. ఓటీటీలోకి అడుగుపెట్టిన కొన్ని గంటల్లోనే ఈ మూవీ టాప్ ట్రెండింగ్ మూవీస్‌లో నంబర్ టూ స్థానాన్ని కైవసం చేసుకుంది. కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ స్వీయదర్శకత్వంలో వచ్చిన ‘రాయన్’ ప్రస్తుతానికి నంబర్ 1లో కొనసాగుతోంది.

కాగా కల్కి చిత్రంలో ఇండియన్ లెజెండరీ యాక్టర్స్ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ కీలక పాత్రలు కనిపించగా.. బాలీవుడ్ బ్యూటీస్ దీపికా పదుకొణె, దిశా పటాని కథానాయికలుగా నటించారు. అలాగే మాళవిక నాయర్, బెంగాలీ నటుడు స్వాస్థ్ ఛటర్జీ, రాజేంద్రప్రసాద్‌, పశుపతి తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్
ఆన్‌లైన్‌ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్‌ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.