టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్ దిల్‌రాజు ప్రొడక్షన్స్ పతాకంపై రూపొందుతోన్న సినిమా ‘జనక అయితే గనక’. శిరీష్ సమర్పణలో హర్షిత్ రెడ్డి, హన్షిత రెడ్డి నిర్మించారు. అంబాబీపేట మ్యారేజీ బ్యాండు, ప్రసన్న వదనం సినిమాలతో ప్రేక్షకులను అలరించిన ట్యాలెంటెడ్ అండ్ వెర్సటైల్ యాక్టర్ సుహాస్ హీరోగా నటిస్తున్నాడు. సందీప్ రెడ్డి బండ్ల డైరక్ట్ చేశారు. సెప్టెంబర్ 7న ఈ సినిమా గ్రాండ్‌గా విడుదల కానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా నుంచి ఒక ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ అందింది. జనక అయితే గనక యుఎస్‌ఏ థియేట్రికల్ హక్కులను హీరో సుహాస్ స్వయంగా చేజిక్కించుకున్నాడు. తాజాగా ఈ సినిమా ఫైనల్ వెర్షన్‌ని చూసిన సుహాస్, మూవీపై కాన్ఫిడెన్స్ తో యుఎస్‌ఏలో రిలీజ్ చేయడానికి ఆసక్తి కనబరిచాడు. దీంతో దిల్‌రాజు ప్రొడక్షన్స్ వారితో మాట్లాడి హక్కులను సొంతం చేసుకున్నట్టు తెలుస్తోంది.
ఈ సందర్భంగా హీరో సుహాస్ మాట్లాడుతూ.. ”ఫైనల్ వెర్షన్ చూశాను. చాలా బాగా నచ్చింది. వెంటనే యుఎస్‌ఏ హక్కులను తీసుకున్నాను. పక్కా ఎంటర్‌టైనింగ్ సినిమా అవుతుంది. ప్రతి దానికీ లెక్కలు చెప్పే మిడిల్ క్లాస్ అబ్బాయిగా ఈ సినిమాలో కనిపిస్తాను. తప్పకుండా ప్రేక్షకులు పడీ పడీ నవ్వుకుంటారు. మా డైరక్టర్ చాలా మంచి సినిమా చేశారు. దిల్‌రాజు గారు సపోర్ట్ చేసిన తీరు మర్చిపోలేం” అని అన్నారు.
కాగా ఈ సినిమాలో సుహాస్‌కు జోడీగా సంగీర్తన ఫిమేల్ లీడ్ రోల్ పోషిస్తుండగా.. రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిషోర్, మురళీ శర్మ, గోపరాజు, రఘుబాబు, పృథ్వీ, శివన్నారాయణ, రూపలక్ష్మి, విజయలక్ష్మి తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. విజయ్ బుల్గానిన్ సంగీతం సమకూరుస్తుండగా.. సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ, కోదాటి పవన్ కల్యాణ్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అలాగే ప్రొడక్షన్ డిజైనర్‌గా అరసవిల్లి రామ్‌కుమార్, కాస్ట్యూమ్ డిజైనర్‌గా భరత్ గాంధీ పనిచేస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























