జనక అయితే గనక రిలీజ్ డేట్ ఫిక్స్

janaka aithe ganaka movie release date fixed

టాలీవుడ్ టాలెంటెడ్ నటుల్లో సుహాస్ పేరు కూడా ముందుంటుంది. ఇప్పటికే ఈ ఏడాది రెండు సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్లను అందుకున్నాడు. ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఆ సినిమానే జనక అయితే గనక. సందీప్ రెడ్డి బండ్ల దర్శకత్వంలో ఈ సినిమాను తెరాకెక్కిస్తున్నారు. ఇక ఈసినిమా షూటింగ్ ను పూర్తిచేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకునే పనిలో ఉంది. మరోవైపు ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మొదలుపెట్టారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమా నుండి ఫస్ట్ సింగిల్ ను నేడు రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే కదా. సుహాస్ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఈ సినిమా నుంచి ‘నా ఫేవ‌రేట్ నా పెళ్లాం’ సాంగ్‌ను లాంచ్ చేశారు. ఇప్పుడు మరో క్రేజీ అప్ డేట్ తో వచ్చారు. ఈసినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేస్తూ అధికారికంగా ప్రకటించారు మేకర్స్. సెప్టెంబర్ 7వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

కాగా ఈసినిమాలో సంకీర్త‌న విపిన్‌ హీరోయిన్ గా నటిస్తుండగా.. రాజేంద్ర ప్ర‌సాద్‌, వెన్నెల కిషోర్‌, ముర‌ళీ శ‌ర్మ‌, గోప‌రాజు, ర‌ఘుబాబు, పృథ్వీ, శివ‌న్నారాయ‌ణ‌, రూప‌ల‌క్ష్మి, విజ‌య‌లక్ష్మి త‌దిత‌రులు నటిస్తున్నారు. దిల్ రాజు ప్రొడ‌క్ష‌న్స్‌ పై వస్తున్న ఈసినిమాను హ‌ర్షిత్ రెడ్డి, హ‌న్షిత‌ నిర్మిస్తున్నారు. సినిమాటోగ్ర‌ఫీ: సాయిశ్రీరామ్‌, సంగీతం: విజ‌య్ బుల్గానిన్‌ అందిస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.