అమెజాన్ ప్రైమ్ వీడియోలో నేషనల్ వైడ్ గా టాప్ ట్రెండ్ లో హరోంహర

harom hara movie trending nationwide in amazon prime video

టాలీవుడ్ టాలెంటెడ్ హీరో సుధీర్ బాబు హీరోగా జ్ఞాన సాగర్ దర్శకత్వంలో వచ్చిన సినిమా హరోంహర. ఔట్ అండ్ ఔట్ యాక్ష‌న్ ఎంటర్ టైనర్ గా కుప్పం ప్రాంత నేప‌థ్యంలో 1980 పీరియాడిక‌ల్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ మూవీని తెర‌కెక్కించారు. రిలీజ్ కు ముందే ఈసినిమా టీజర్, ట్రైలర్ సినిమాపై అంచనాలను క్రియేట్ చేశాయి. ఇక ఎన్నో అంచనాల మధ్య ఈసినిమా రీసెంట్ గా రిలీజ్ అయి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈసినిమా బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ నే సొంతం చేసుకుంది. సుదీర్ బాబు అద్భుతమైన నటన.. స్క్రీన్ ప్రెజెన్స్ మరియు కుప్పం స్లాంగ్‌లో డైలాగ్ డెలివరీ ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా ఈసినిమా ఇప్పటికే ఓటీటీలోకి వచ్చిన సంగతి తెలిసిందే కదా. ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన అమెజాన్ ప్రైమ్ లో కూడా ఈసినిమా రిలీజ్ అయింది. ఇక ఇప్పుడు ఓటీటీలో కూడా ఈసినిమా మంచి రెస్పాన్స్ తో దూసుకోపోతుంది. రిలీజ్ అయి దాదాపు వారం రోజులు అవుతున్నా టాప్ 1లో ట్రెండింగ్ అవుతూనే ఉంది. అంతేకాదు నేషనల్ వైడ్ గా కూడా ఈసినిమా టాప్ ట్రెండింగ్ లో దూసుకుపోతుంది. కేవలం తెలుగు ప్రేక్షకులే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న సినిమా ప్రేక్షకులు ఈ సినిమాను అమెజాన్ లో వారం రోజులుగా ట్రెండింగ్ లో కొనసాగిస్తున్నారు. ఆహా, ఈటీవీ విన్ లో కూడా ఈసినిమా స్ట్రీమింగ్ అవుతోంది.

కాగా ఈసినిమాలో మాళవిక శర్మ హీరోయిన్ గా నటిస్తుండగా.. సునీల్, రవి కాలే, రాజశేఖర్ అనింగి, కేషల్ దీపక్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్‌ బ్యానర్ పై సుమంత్‌ జీ నాయుడు నిర్మించగా.. చైతన్ భరద్వాజ్ సంగీతం.. అరవింద్ విశ్వనాథన్ సినిమాటోగ్రఫి అందించారు.

ఇక హరోంహర కథ విషయానికి వస్తే కుప్పం గ్రామంలో తిమ్మారెడ్డి, అతని సోదరుడు బసవ (రవి కాలె), కొడుకు శరత్ రెడ్డి (అర్జున్ గౌడ) అరాచకమైన పనులు చేస్తుంటూ పెత్తనం సాగిస్తుంటారు. మరోవైపు అదే ఊరిలోకి పాలిటెక్నిక్ కాలేజీలో ఉద్యోగంలో చేరడానికి వస్తాడు సుబ్రహ్మణ్యం (సుదీర్ బాబు). ఆ క్రమంలో కొన్ని పరిస్థితుల నేపథ్యంలో శరత్ రెడ్డి మనుషులతో గొడవపడటంతో సుబ్రహ్మణ్యం ఉద్యోగం పోతుంది. జాబ్ పోవడంతో ఆర్థిక పరిస్థితుల కారణంవల్ల తన ఫ్రెండ్ ప‌ళ‌ని స్వామి అనే కానిస్టేబుల్‌తో క‌లిసి గ‌న్ స్మ‌గ్లింగ్ బిజినెస్‌లోకి అడుగుపెడ‌తాడు సుబ్రహ్మణ్యం . అక్క‌డి నుంచి సుబ్ర‌హ్మ‌ణ్యం జీవితం ఎలాంటి మ‌లుపులు తిరిగింది? పోలీసుల‌కు దొరికిన సుబ్ర‌హ్మ‌ణ్యం ఎలా అదృశ్యంమ‌య్యాడు? సుబ్ర‌హ్మ‌ణ్యాన్ని చంపాల‌ని అనుకున్న త‌మ్మిరెడ్డి, బ‌స‌వారెడ్డి ప్ర‌య‌త్నాలు ఎలా ఫెయిల‌య్యాయి అన్న‌దే హ‌రోంహ‌ర మూవీ క‌థ..

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.