రీ రిలీజ్‌కి సిద్దమైన ‘ఎటో వెళ్లిపోయింది మనసు’

Nani and Samantha’s Yeto Vellipoyindhi Manasu Ready For Re-release

ప్రేమ కథా చిత్రాలకు ఎప్పుడూ ఆదరణ లభిస్తూనే ఉంటుంది. పైగా గౌతమ్ మీనన్ వంటి దర్శకులు తీసిన చిత్రాలను అయితే ఎప్పుడూ మరిచిపోలేరు. ఆయన తీసిన ఎన్నో ఎవర్ గ్రీన్ లవ్ స్టోరీ మూవీస్ ఇప్పటి తరాల్ని కూడా అలరిస్తూ ఉంటాయి. నాని, సమంత కలిసి చేసిన ‘ఎటో వెళ్లిపోయింది మనసు’ అనే సినిమా కుర్రాళ్ల హృదయాల్ని హత్తుకుంది. ఈ మూవీని ఫోటాన్ కథాస్ సమర్పణలో తేజ సినిమా బ్యానర్ మీద సి.కళ్యాణ్ నిర్మించారు. ఆగస్ట్ 2న ఈ చిత్రాన్ని లక్ష్మీ నరసింహా మూవీస్ బ్యానర్ మీద సుప్రియ, శ్రీనివాస్ రీ రిలీజ్ చేస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

పన్నెండేళ్ల క్రితం వచ్చిన ఈ ఫీల్ గుడ్ లవ్ స్టోరీ మూవీని మళ్లీ ఆడియెన్స్ ముందుకు తీసుకు వస్తున్నారు. అసలే టాలీవుడ్‌లో రీ రిలీజ్‌ల ట్రెండ్ నడుస్తుండగా ఇప్పుడు నాని, సమంతల క్యూట్ లవ్ స్టోరీని తెరపైకి తీసుకు రాబోతున్నారు. గౌతమ్ మీనన్ దర్శకత్వం, ఇళయరాజా సంగీతం ఈ సినిమాను క్లాసిక్‌గా నిలబెట్టాయి. ఇళయరాజా అందించిన మెలోడీ గీతాలు ఇప్పటికీ ప్రేక్షకుల్ని మెప్పిస్తుంటాయి. మళ్లీ ఈ చిత్రాన్ని వీక్షించి నాటి రోజుల్లోకి వెళ్లేందుకు ఆడియెన్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.