మెగా ప్రిన్స్ వరణ్ తేజ్ ప్రస్తుతం మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. ప్రస్తుతం తన నుండి వస్తున్న సినిమా మట్కా. కరుణ కుమార్ దర్శకత్వంలో పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా, 1960 బ్యాక్‌డ్రాప్‌తో, గ్యాంబ్లింగ్ తరహా కథాంశంతో ఈ సినిమా ఉండబోతుంది. ఈసినిమా నుండి ఇప్పటికే గ్లింప్స్ ను రిలీజ్ చేయగా గ్లింప్స్ బాగానే ఆకట్టుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈసినిమా షూటింగ్ ను మళ్లీ ఇటీవలే మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. గత కొద్దిరోజులుగా రామోజీ ఫిలిం సిటీలో వేసిన వింటేజ్ వైజాగ్ సెట్ లో షూటింగ్ ను జరుపుతున్నారు. అందుకు సంబంధించిన వీడియోను కూడా రిలీజ్ చేశారు. ఇక ఇప్పుడు షూటింగ్ కు సంబంధించి మరో అప్డేట్ తో వచ్చారు మేకర్స్. రామోజీ ఫిలీం సిటీలో లాంగ్ అండ్ కీ షెడ్యూల్ షూటింగ్ పూర్తయింది.. ఈ షెడ్యూల్ లో కీలక సన్నివేశాలు, హై ఆక్టేన్ యాక్షన్ సన్నివేశాలు, రెట్రో థీమ్ సాంగ్స్ ను చిత్రీకరించినట్టు తెలిపారు. అంతేకాదు ఈసినిమా తరువాత షెడ్యూల్ ను వైజాగ్ లో జరపనున్నట్టు తెలియచేశారు.
కాగా ఈసినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తుండగా బాలీవుడ్ బ్యూటీ నోరా ఫతేహీ కూడా కీలక పాత్రలో నటిస్తుంది. నవీన్ చంద్ర మరో కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈసినిమాను పాన్ ఇండియా లెవల్లో భారీ స్థాయిలో నిర్మించనున్నారు. వైరా ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈసినిమాను తెలుగు తో పాటు తమిళ్, హిందీ, కన్నడ, మలయాళంలో ఈసినిమాను రిలీజ్ చేయనున్నారు. జీవి ప్రకాష్ ఈసినిమాకు సంగీతం అందిస్తున్నాడు. సినిమాటోగ్రాఫర్ గా కిషోర్ కుమార్ పనిచేస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:


























