ఎనర్జిటిక్ హీరో రామ్, డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ నుండి రాబోతున్న మోస్ట్ అవైటెడ్ సినిమా డబుల్ ఇస్మార్ట్. ఈసినిమాపై భారీ అంచనాలు ఏర్పడానికి కారణం ఇస్మార్ట్ శంకర్ సినిమానే కారణం. ఇస్మార్ట్ శంకర్ సినిమా బ్లాక్ బస్టర్ అందించడం వల్లనే డబుల్ ఇస్మార్ట్ తెరపైకి తీసుకొచ్చారు. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. ఇక ఆగష్ట్ 15వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో మరోపక్క ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టారు. ఇప్పటికే టీజర్ ను రిలీజ్ చేయగా రామ్ ఫుల్ మాస్ అండ్ ఎనర్జిటిక్ పెర్ఫెమెన్స్ కు మంచి ప్రశంసలు దక్కాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈసినిమా నుండి ఇప్పటికే ఫస్ట్ సాంగ్ ను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే కదా. స్టెప్పా మార్ అంటూ వచ్చే ఫస్ట్ సాంగ్ సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు సెకండ్ సింగిల్ కు సంబంధించిన అప్ డేట్ వచ్చేసింది. మార్ ముంత చోడ్ చింత అంటూ వచ్చే సెకండ్ సింగిల్ కు రిలీజ్ డేట్ ఫిక్స్ చేస్తూ ప్రకటించారు మేకర్స్. ఈపాటను జులై 16వ తేదీన రిలీజ్ చేస్తున్నట్టు తెలిపారు చిత్రబృందం. మరి చూడబోతే ఈపాట కూడా ఫుల్ మాస్ గా ఉండబోతున్నట్టు అర్థమవుతుంది.
కాగా ఈసినిమాలో కావ్యా థాపర్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈసినిమాలో ఇంకా బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇంకా ఈసినిమాలో అలీ, షయాజీ షిండే, గెటప్ శ్రీను, ఇతర పాత్రల్లో కనిపించనున్నారు. ఈసినిమాను పూరి కనెక్ట్స్ పై పూరీ జగన్నాథ్, ఛార్మి కలిసి నిర్మించనున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. శ్యామ్ కే నాయుడు, జియాని జియానెలి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























