ఫిలింఫేర్ అవార్డుల్లో సత్తా చాటిన తెలుగు చిత్రాలివే..!

68th Filmfare Awards South 2023 RRR, Sita Ramam and Virata Parvam Wins For Telugu

2023వ సంవ‌త్స‌రానికి గానూ 68వ సౌత్ ఇండియా ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ ప్రకటించారు. ఈ మేరకు తాజాగా ప్ర‌క‌టించిన అవార్డుల్లో కొన్ని తెలుగు చిత్రాలు సత్తా చాటాయి. వీటిలో ప్రధానంగా ఆర్ఆర్ఆర్, సీతారామం, విరాట ప‌ర్వం సినిమాలు వివిధ విభాగాల్లో పలు అవార్డులను గెలుచుకున్నాయి. కాగా గతేడాది బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ అందుకున్న ఆర్ఆర్ఆర్ సౌత్ ఇండియా ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ లోనూ అనేక అవార్డులను కొల్లగొట్టింది. ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు, ఉత్తమ డైరెక్టర్ వంటి వాటితోపాటు మొత్తం ఏకంగా 7 విభాగాల్లో అవార్డులు గెలుచుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఫిలింఫేర్ అవార్డుల్లో సత్తా చాటిన తెలుగు చిత్రాలివే..!

  • బెస్ట్ ఫిలిం: ఆర్ఆర్ఆర్
  • బెస్ట్ ఫిలిం (క్రిటిక్స్): సీతారామం
  • ఉత్త‌మ ద‌ర్శ‌కుడు: రాజ‌మౌళి (ఆర్ఆర్ఆర్)
  • బెస్ట్ యాక్ట‌ర్స్‌: జూ. ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్‌ (ఆర్ఆర్ఆర్)
  • బెస్ట్ యాక్ట‌ర్ (క్రిటిక్స్): దుల్కర్ సల్మాన్ (సీతారామం)
  • బెస్ట్ యాక్ట్రెస్: మృణాల్ ఠాకూర్ (సీతారామం)
  • బెస్ట్ యాక్ట్రెస్ (క్రిటిక్స్‌): సాయి ప‌ల్ల‌వి ( విరాట ప‌ర్వం)
  • బెస్ట్ స‌పోర్టింగ్ యాక్ట‌ర్‌ రానా (భీమ్లా నాయ‌క్)
  • బెస్ట్ స‌పోర్టింగ్ యాక్ట్రెస్: నందితా దాస్ (విరాట ప‌ర్వం)
  • బెస్ట్ మ్యూజిక్ అల్బ‌మ్: కీర‌వాణి (ఆర్ఆర్ఆర్)
  • ఉత్త‌మ గేయ ర‌చ‌యిత‌: సిరివెన్నెల సీతారామ శాస్త్రి (కానున్న కళ్యాణం – సీతారామం)
  • బెస్ట్ ప్లేబాక్ సింగ‌ర్ (మేల్): కాల భైర‌వ (కొమ‌రం భీముడో – ఆర్ఆర్ఆర్)
  • బెస్ట్ ప్లే బ్యాక్ సింగ‌ర్ (ఫిమేల్): చిన్మ‌యి శ్రీపాద (సీతారామం)
  • బెస్ట్ సినిమాటోగ్ర‌ఫీ: సెంథిల్‌, ర‌వి వర్మ‌న్‌
  • బెస్ట్ కొరియోగ్రఫీ: ప్రేమ్ రక్షిత్ (నాటు నాటు – ఆర్ఆర్ఆర్)
  • బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్: సాబు సిరిల్ (ఆర్ఆర్ఆర్)
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.