ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన సినిమా కల్కి 2898ఏడీ. ఎన్నో అంచనాల మధ్య ఈసినిమా జూన్ 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక అంచనాలను నిజం చేస్తూ ఈసినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో పురాణాలను భవిష్యత్‌ను కలుపుతూ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించారు. నటీనటుల నటన, వావ్ అనిపించేలా విజువల్స్, వీఎఫ్‌ఎక్స్ మరియు భారీ యాక్షన్ ఎపిసోడ్స్ వంటి అంశాలు ఈ సినిమాలో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈసినిమా కలెక్షన్స్ పరంగా అన్ని చోట్లా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే కదా. రెండు రాష్ట్రాల్లో ఈసినిమా ఇప్పటికే 105 కోట్లకు పైగా కలెక్షన్స్ ను రాబట్టుకుంది. ఇక మరోసారి నార్త్ ఆడియన్స్ మరో తెలుగు సినిమాకు పట్టాం కట్టారు. కల్కి సినిమా హిందీలో 200 కోట్ల దిశగా కలెక్షన్స్ ను రాబట్టుకుంటుంది. ఇక తమిళనాడులో కూడా ఈసినిమా సాలిడ్ కలెక్షన్స్ ను రాబట్టుకంటుంది. ఫస్ట్ వీక్ లో ఈసినిమా 28కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టుకొని బ్రేక్ ఈవెన్ ను సొంతం చేసుకుంది. ఇక ఓవర్సీస్ లో సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రీ సేల్స్ లోనే ఈసినిమా రికార్డులు క్రియేట్ చేసింది. ఇలా ఈసినిమా ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకూ 800 కోట్ల కలెక్షన్స్ ను రాబట్టుకుంది. ఈవిషయ్నాన్ని చిత్రయూనిట్ అధికారికంగా తెలియచేసింది. అంతేకాదు అన్న చోట్లా కూడా బ్రేక్ ఈవెన్ ను సాధించినట్టు తెలుస్తుంది.
కాగా ఈసినిమాలో దీపికా పదుకొనె, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దిశా పటానీ, సస్వతా ఛటర్జీ, శోభన, అన్నా బెన్, విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్, దుల్కర్ సల్మాన్, రాజేంద్ర ప్రసాద్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈసినిమాకు సంతోష్ నారాయణన్ సంగీతం అందించగా.. జోర్డ్జే స్టోజిల్జ్కోవిచ్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేశారు. ఈసినిమాను తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళం, ఇంగ్లీష్ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేశారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























