ఈ ఏడాది ఇప్పటికే కెప్టెన్ మిల్లర్ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు విలక్షణ నటుడు ధనుష్. ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉండగా అందులో రాయన్ సినిమా కూడా ఒకటి. ఈసినిమాకు స్వయంగా ధనుషే దర్శకత్వం వహిస్తుండటం విశేషం. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను పూర్తిచేసుకునే పనిలో ఉంది. మరోవైపు అప్ డేట్లు కూడా ఇస్తూ సినిమాపై మంచి బజ్ ను క్రియేట్ చేస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇప్పటికే ఈసినిమా నుండి రెండు పాటలను రిలీజ్ చేశారు. రెండు పాటలు కూడా మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నాయి. ఇప్పుడు మూడో పాటను రిలీజ్ చేశారు మేకర్స్. రాయన్ రంబుల్ అంటూ వచ్చే ఈపాటను తాజాగా విడుదల చేశారు. ఈపాట కూడా ఆకట్టుకుంటుంది.
కాగా ఈసినిమాలో ఇంకా ఎస్.జే.సూర్య, ప్రకాష్ రాజ్, సెల్వరాఘవన్, ధుషార విజయన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తమిళ్ టాప్ నిర్మాణ సంస్థ అయిన సన్ పిక్చర్స్ బ్యానర్ పై ఈసినిమాను నిర్మిస్తున్నారు. ఓం ప్రకాశ్ డీవోపీగా అలానే యాక్షన్ కొరియోగ్రాఫర్‌గా పీటర్ హెయిన్ వ్యవహరిస్తున్నారు. జులై 26వ తేదీన తెలుగు, తమిళం, హిందీ భాషల్లో రాయన్ విడుదల కానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























