జై సినిమాతో హీరో గా తెలుగు తెరకు పరిచయమై ఆతర్వాత హీరో కాకుండా పలు ఇంట్రెస్టింగ్ రోల్స్ లో నటించి తనకంటూ ప్రత్యేకగుర్తింపు తెచ్చుకున్నాడు నవదీప్. గతకొద్ది కాలంగా సినిమాలకు దూరంగా ఉన్న నవదీప్ రీసెంట్ గా మరో డిఫరెంట్ సినిమాతో వచ్చాడు. అవనీంద్ర దర్శకత్వంలో నవదీప్ హీరోగా వస్తున్న సినిమా లవ్ మౌళి. ఈ చిత్రం జూన్ 7న ప్రేక్షకుల ముందుకొచ్చింది. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈసినిమా అనుకున్నంత విజయాన్ని అయితే అందించలేకపోయింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ సినిమా ఓటీటీ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన ఆహా వారు సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే కదా. ఇప్పటికే ఓటీటీ రిలీజ్ డేట్ ను కూడా ఫిక్స్ చేశారు. జూన్ 28వ తేదీన ఓటీటీలోకి రానున్నట్టు తెలిపారు. ఈనేపథ్యంలో నేటి నుండి ఈసినిమా స్ట్రీమింగ్ కు వచ్చేసింది. మరి థియేటర్లలో చూడని వారు ఓటీటీలో చూసి ఎంజాయ్ చేసేయండి.
కాగా ఈసినిమాలో హీరోయిన్ గా పంఖురి గిద్వానీ నటించింది. రానా దగ్గుబాటి అతిథి పాత్రలో కనిపించాడు. నైరా క్రియేషన్స్, సి స్పేస్ గ్లోబల్ బ్యానర్స్ పై ప్రశాంత్ రెడ్డి తాటికొండ ఈ సినిమాని నిర్మించారు. గోవింద్ వసంత ఈసినిమాకు సంగీతం అందించారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























