ఈవయసులో కూడా సూపర్ స్టార్ రజనీకాంత్ వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ఇప్పటికే వెట్టైయాన్ సినిమా షూటింగ్ ను పూర్తి చేసుకున్నాడు. టీజే జ్ఞానవేలు దర్శకత్వంలో ఈసినిమా రూపొందుతుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటున్న ఈసినిమాలో మంజు వారియర్, రితికా సింగ్, అమితాబ్, ఫహాద్ ఫాజిల్, రావు రమేష్ పలువురు కీలక పాత్రల్లో నటిస్తుండగా.. భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్నాడు. అనిరుథ్ ఈసినిమాకు సంగీతం అందిస్తున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
దీనితో పాటు కూలీ సినిమాను కూడా చేయనున్నాడు. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ఈసినిమా తెరకెక్కనుంది. ఇక ఈసినిమా ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుంది అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈమధ్య జులైలో ఈసినిమా సెట్స్ వెళుతుందన్న వార్తలు కూడా వచ్చాయి. ఈనేపథ్యంలో తాజాగా ఈసినిమాపై క్రేజీ అప్ డేట్ ఇచ్చాడు లోకేష్ కనగరాజ్. తన ట్విట్టర్ ద్వారా రజనీ కాంత్ ఫొటోను పోస్ట్ చేస్తూ.. దానికి లుక్ టెస్ట్.. జులై నుండి షూటింగ్ ను మొదలుపెట్టనున్నట్టు తెలిపాడు. మరి తలైవా లుక్ టెస్ట్ ఫొటోనే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
కాగా ఈసినిమాలో శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా సత్యరాజ్ మరో కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈసినిమాను సన్ పిక్చర్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో కళానిధి మారన్ నిర్మిస్తున్నాడు. అనిరుథ్ ఈసినిమాకు సంగీతం అందించబోతున్నాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























