ప్రముఖ మలయాళ నటి నివేదా థామస్ చాలాకాలం గ్యాప్ తర్వాత కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఆమె ప్రధానపాత్రలో నటిస్తోన్న తాజా చిత్రం ’35 – చిన్న కథ కాదు’. తాజాగా ఈ మూవీ టైటిల్ అనౌన్స్‌మెంట్ పోస్టర్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని సురేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రానా దగ్గుబాటి సమర్పిస్తుండగా.. నందకిశోర్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఇక తిరుపతి బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా ఉండబోతున్నట్లు మేకర్స్ ఇప్పటికే తెలిపారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
తాజాగా హీరోయిన్ నివేదా థామస్ ఈ సినిమాకు సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ అందించింది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించగా.. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘కల్కి 2898 ఏడీ’ గురువారం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కాబోతుందన్న సంగతి తెలిసిందే కదా. ఈ నేపథ్యంలో కల్కి సినిమాతోపాటే ’35 – చిన్న కథ కాదు’ మూవీ టీజర్ కూడా ప్రీమియర్ కానుంది.
ఈ మేరకు నివేదా థామస్ సోషల్ మీడియా వేదికగా తెలిపింది. అందులో.. “ఇదో, మీరు జూస్తే చాలు, మాకదే పదేలు.. రేపు పీవీఆర్ సినిమాస్‌లో మాత్రమే” అని పేర్కొంది. అయితే ఈ అవకాశం ఒక్క PVR సినిమాస్‌లో మాత్రమే అని, అదికూడా ఈ ఒక్కరోజేనని స్పష్టం చేసింది. ఇక ఈ చిత్రంలో ప్రియదర్శి, విశ్వదేవ్ లీడ్ రోల్స్‌లో నటిస్తుండగా.. వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్నారు. కాగా 35 మూవీ ఆగస్టు 15న తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో విడుదల కానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























