ఈమధ్య థియేటర్లలో రిలీజ్ అయిన సినిమాలు కొన్ని రోజులకే ఓటీటీలో సందడి చేయడానికి వచ్చేస్తున్నాయి. సూపర్ హిట్ సినిమాలు కాస్త లేటుగా ఓటీటీలోకి వస్తున్నా కొన్ని సినిమాలు అయితే మాత్రం రిలీజ్ అయిన పది రోజుల్లోపే ఓటీటీలోకి వస్తున్నాయి. ఇప్పుడు ఆ జాబితాలోకి వచ్చేసింది నవదీప్ లవ్ మౌళి సినిమా. అవనీంద్ర దర్శకత్వం వహించిన ఈ చిత్రం జూన్ 7న ప్రేక్షకుల ముందుకొచ్చింది. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈసినిమా అనుకున్నంత విజయాన్ని అయితే అందించలేకపోయింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇప్పుడు ఈసినిమా ఓటీటీ పార్టనర్ ను లాక్ చేసుకుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన ఆహా వారు ఈసినిమా ఓటీటీ హక్కులను సొంతం చేసుకుంది. ఈవిషయాన్ని చిత్రయూనిట్ అధికారికంగా తెలియచేసింది. ఓటీటీ రిలీజ్ డేట్ ను త్వరలోనే ప్రకటించనున్నారు.
కాగా ఈసినిమాలో హీరోయిన్ గా పంఖురి గిద్వానీ నటించింది. రానా దగ్గుబాటి అతిథి పాత్రలో కనిపించాడు. నైరా క్రియేషన్స్, సి స్పేస్ గ్లోబల్ బ్యానర్స్ పై ప్రశాంత్ రెడ్డి తాటికొండ ఈ సినిమాని నిర్మించారు. గోవింద్ వసంత ఈసినిమాకు సంగీతం అందించారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























