టాలీవుడ్ టాలెంటెడ్ హీరో సందీప్ కిషన్ ఇటీవలే ‘ఊరు పేరు భైరవకోన’ సినిమాతో విజయాన్ని అందుకున్నారు. ఈ క్రమంలో ఆయన తాజాగా మరో కొత్త సినిమాను పట్టాలెక్కించేశారు. కాగా ఇది సందీప్ కిషన్‌కు ల్యాండ్‌మార్క్ (30వ) చిత్రం కావడం విశేషం. వర్కింగ్ టైటిల్ #SK30గా వ్యవహరిస్తున్న ఈ సినిమాకు ‘ధమాకా’ ఫేమ్ త్రినాధ రావు నక్కిన దర్శకత్వం వహిస్తున్నారు. విభిన్నమైన స్క్రిప్ట్‌లతో అలరించే సందీప్ కిషన్ #SK30లో డిఫరెంట్ క్యారెక్టర్లో కనిపించనున్నారు. ఇందులో సందీప్ కిషన్ క్యారెక్టరైజేషన్ గత చిత్రాల కంటే భిన్నంగా ఉండనుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమా ఇటీవలే గ్రాండ్‌గా లాంచ్ అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బుధవారం హైదరాబాద్‌లో #SK30 రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది. త్రినాధరావు నక్కిన విజయవంతమైన ప్రయాణంలో భాగమైన రచయిత ప్రసన్న కుమార్ బెజవాడ కథ, స్క్రీన్‌ప్లే మరియు డైలాగ్ రైటర్‌గా ఈ SK30కి పని చేస్తున్నారు. కాగా ఈ చిత్రం అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో భారీ స్థాయిలో రూపొందించబడుతోంది. విలక్షణ నటుడు రావు రమేష్ కీలక పాత్రలో కనిపించనుండగా.. ఇతర నటీనటుల వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారు.
ఈ క్రేజీ ప్రాజెక్టులో యంగ్ అండ్ టాలెంటెడ్ టెక్నీషియన్స్ వివిధ క్రాఫ్ట్‌లలో భాగం కానున్నారు. లియోన్ జేమ్స్ సంగీతం అందిస్తుండగా.. నిజార్ షఫీ సినిమాటోగ్రాఫర్‌గా, బ్రహ్మ కడలి ఆర్ట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. ఏకే ఎంటర్టైన్మెంట్, హాస్య మూవీస్, జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు రాజేష్ దండా నిర్మాతగా, బాలాజీ గుత్తా సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సామజవరగమన, ఊరు పేరు భైరవకోన వంటి వరుస హిట్లను అందించిన ప్రొడక్షన్ హౌస్ నుంచి వస్తున్న చిత్రం కావడంతో దీనిపై భారీ అంచనాలే ఉన్నాయి.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:


























