పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుండి రాబోతున్న మోస్ట్ అవైటెడ్ సినిమా హరిహర వీరమల్లు సినిమా. క్రిష్ దర్శకత్వంలో మొగలాయిల కాలం నేపథ్యంలో ఈసినిమా రాబోతుంది. ఈసినిమాలో పవర్ స్టార్ ఫస్ట్ టైం ఒక వారియర్ గా కనిపిస్తున్నారు. ఇప్పటివరకూ ఈసినిమా చాలా వరకూ షూటింగి ను పూర్తి చేసుకుంది. అయితే పవన్ రాజకీయాలతో బిజీగా ఉండటంతో సినిమా షూటింగ్ పెండింగ్ లో పడిపోయింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇప్పుడు ఈసినిమా షూటింగ్ పై ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తుంది. అదేంటంటే.. జులై ఫస్ట్ వీక్ నుండి ఈ సినిమా షూటింగ్ ను మళ్లీ మొదలుపెట్టాలని చూస్తున్నారట. అంతేకాదు పవన్ నుండి కూడా ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ కూడా వచ్చిందని అంటారు. మరోవైపు ఈ ఏడాది చివర్లో ఈ సినిమా పార్ట్-1 ను రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. అందుకు తగ్గట్టుగానే సినిమా షూటింగ్ ను పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా పూర్తి చేయాలని అనుకుంటున్నారట. చూద్దాం మరి దీనిపై అధికారిక ప్రకటన ఇస్తుందేమో చూద్దాం..
కాగా పవన్ కళ్యాణ్‌కు జోడీగా నిధి అగర్వాల్ నటిస్తుండగా.. అర్జున్ రాంపాల్ కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రముఖ నిర్మాత ఎ.ఎం.రత్నం తన మెగా సూర్యా ప్రొడక్షన్ బ్యానర్‌పై ఈ సినిమాను సమర్పిస్తున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు యం.యం.కీరవాణి సంగీతం అందిస్తుండగా.. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ జ్ఞాన శేఖర్ వి.ఎస్. సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























