మలయాళం స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ కు తెలుగులో కూడా మంచి ఫోలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. మహానటి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన దుల్కర్ మొదటి సినిమాతోనే తెలుగులో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తరువాత వచ్చిన సీతారామం సినిమాతో మరో మెట్టు ఎక్కాడు. ఈసినిమా ఘన విజయం సాధించింది. ఇప్పుడు డైరెక్టర్ గా తెలుగులో మరో సినిమాతో వస్తున్నాడు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ హీరోగా వస్తున్న సినిమా లక్కీ భాస్కర్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుంటుంది. రీసెంట్ గానే ఈసినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించారు. సెప్టెంబర్ 27వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పుడు మ్యూజికల్ ప్రమోషన్స్ ను కూడా మొదలుపెట్టారు. ఇప్పటికే ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్ ను కూడా ప్రకటించారు. ఫస్ట్ సింగిల్ ను జూన్ 19 వ తేదీన ఈసినిమాను రిలీజ్ చేయనున్నారు. దీనిలో భాగంగానే తాజాగా ఈపాట ప్రోమో ను రిలీజ్ చేశారు. మెలోడియస్ గా ఉన్న ఈపాట ఆకట్టుకుంటుంది.
కాగా ఈసినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తుంది. ఈసినిమాను సితారా ఎంటర్ టైన్ మెంట్స్, ఫార్చూన్ 4 సినిమాస్ బ్యానర్ పై నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఈసినిమాను తెలుగు తో పాటు మలయాళంలో కూడా రిలీజ్ చేయనున్నారు. జీవీ ప్రకాష్ ఈసినిమాకు సంగీతం అందిస్తున్నాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























