ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో మంచు విష్ణు ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా కన్నప్ప. ఇక ఎప్పటినుండో ఊరిస్తున్న ఈ సినిమా టీజర్ అయితే వచ్చేసింది. టీజర్ మాత్రం చాలా బాగుంది. కాలాముఖ వాయులింగాన్ని పెకలించి తీసుకురావడానికి పంపిన 50మందిని నీ తమ్ముడు టెంగనతో సహా అందరినీ చంపేశాడు అంటూ మొదలైన టీజర్ ఆద్యంతం ఆకట్టుకుంది. మంచు విష్ణు తిన్నడు పాత్రలో నటిస్తున్నాడు. ఇక విజువల్స్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. న్యూజిలాండ్ లోనే ఈసినిమా సింహ భాగాన్ని తీయాలని మేకర్స్ ఎందుకు అనుకున్నారో ఇప్పుడు అర్థమవుతుంది. పచ్చని అందాలతో చాలా ఫ్రెష్ గా ఉన్నాయి విజువల్స్. యాక్షన్ సీక్వెన్స్ కూడా బాగున్నాయి. ప్రభాస్ కళ్ల వరకూ చూపించారు కానీ తన లుక్ ను ఇంకా రిలీజ్ చేయలేదు. వెరసి కన్నప్ప టీజర్ సినిమాపై అంచనాలను మరింత పెంచేసింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇప్పటికే ఈసినిమా టీజర్ ను కేన్స్ వేదికపై రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే కదా. అక్కడ ఇంటర్నేషనల్ ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్సే వచ్చింది. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుంటుంది. వీలెనంత త్వరగా షూటింగ్ ను పూర్తి చేయాలని చూస్తున్నారు.
కాగా ఈసినిమాలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పాటు కాజల్, మోహన్ లాల్, కన్నడ స్టార్ హీరో శివ రాజ్ కుమార్, ప్రీతి ముకుందన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈసినిమాను అవా ఎంటర్టైన్మెంట్ ఇంకా 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్స్ పై మంచు విష్ణు తండ్రి, సీనియర్ నటుడు మంచు మోహన్ బాబు నిర్మిస్తున్నారు. మణిశర్మ, స్టీఫెన్ దేవాసి సంయుక్తంగా ఈసినిమాకు సంగీతం అందిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























