బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘సర్ఫిరా’. జాతీయ అవార్డు గ్రహీత సుధా కొంగర దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే శాలినీ ఉషాదేవి, పూజా తోలానితో కలిసి సుధా కొంగర స్క్రిప్ట్‌ను అందించారు. కాగా ఈ చిత్రం సూర్య హీరోగా 2020లో వచ్చిన బ్లాక్ బస్టర్ ‘సూరారై పోట్రు’కి రీమేక్ కావడం విశేషం. డైరెక్ట్‌గా ఓటీటీలోకి విడుదలైన ఈ చిత్రం సంచలన విజయాన్ని అందుకుంది. తెలుగులో ఇది ‘ఆకాశమే హద్దురా’ పేరుతో విడుదలైంది. మరో విశేషమేంటంటే.. కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ఇందులో ఓ ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. ఆయనతో పాటుగా ఈ చిత్రంలో రాధిక మదన్, పరేష్ రావల్, సీమా బిస్వాస్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా ‘సర్ఫిరా’ చిత్రాన్ని జ్యోతిక మరియు సూర్యల హోం బ్యానర్ 2D ఎంటర్టైన్మెంట్తో కలిసి కేప్ ఆఫ్ గుడ్ ఫిలింస్ సమర్పణలో అరుణా భాటియా మరియు విక్రమ్ మల్హోర్తా యొక్క అబుండాంటియా ఎంటర్టైన్మెంట్ నిర్మించింది. తాజాగా ఈ మూవీ నుంచి సాలిడ్ అప్డేట్ వచ్చింది. ‘సర్ఫిరా’ సినిమా జూలై 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. ఈ మేరకు మేకర్స్ శుక్రవారం సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తుండగా.. నేషనల్ అవార్డ్ విన్నింగ్ సింగర్ శ్రేయా ఘోషల్, మికా సింగ్, నీతి మోహన్ వంటి ప్రఖ్యాత గాయకులు పాటలకు తమ గాత్రాన్ని అందించారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























