పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన మోస్ట్ అవైటెడ్ మూవీ ‘కల్కి 2898 AD’. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో రూపొందిన ఈ మూవీకి క్రియేటివ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించారు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణే ఫిమేల్ లీడ్ రోల్ పోషించగా.. మరొక నటి బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ కీలక పాత్రలో కనిపించనుంది. గ్లోబల్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో బాలీవుడ్ లెజెండరీ నటుడు అమితాబ్ బచ్చన్, విశ్వ నటుడు కమల్ హాసన్ వంటి స్టార్స్ నటిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
వైజయంతి మూవీస్ పతాకంపై టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ అశ్వనీ దత్ దాదాపు రూ.500 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమా జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలకానుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ కార్యక్రమాలను ముమ్మురం చేసింది. దీనిలో భాగంగా ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజ్ చేసిన గ్లింప్స్, స్పెషల్ వీడియోస్ అన్నీ సినిమాపై అంచనాలను భారీగా పెంచేశాయి. ఇక ఇటీవలే విడుదల చేసిన ట్రైలర్‌తో సినిమాపై అంచనాలు మరింతగా పెరిగాయి.
ఈ క్రమంలో కల్కి విడుదలకు ముందే సరికొత్త రికార్డుని అందుకుంది. అమెరికాలో ప్రీ సేల్స్ లో అతి తక్కువ రోజుల్లో 1 మిలియన్ డాలర్స్ వసూలు చేసి ఔరా అనిపిస్తోంది. ఈ మేరకు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. కాగా ఇంతకుముందు దర్శకధీరుడు ఎస్ఎస్. రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం విడుదలకు 13 రోజులు ఉందనగా ప్రీ సేల్స్ లో 1 మిలియన్ డాలర్స్ మార్క్ అందుకుంది. అయితే ఇప్పుడు కల్కి రిలీజ్ కావడానికి ఇంకా 15 రోజులు ఉండగానే ‘కల్కి 2898 AD’ ఈ మార్క్ చేరుకోవడం విశేషం. ఇక మరోవైపు నార్త్ అమెరికాలో విడుదలకు ఒకరోజు ముందే.. అనగా జూన్ 26నే కల్కి ప్రీమియర్స్ వేయనున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























