ప్రముఖ బాలీవుడ్ నటి దిశా పటానీ నేడు పుట్టినరోజు జరుపుకుంటోంది. ఈ సందర్భంగా ఆమెకు ‘కల్కి 2898 AD’ బృందం జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసింది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా దిశా పటానీకి బర్త్ డే విషెస్ తెలిపిన కల్కి టీమ్.. మూవీలో ఆమె పేరుని రివీల్ చేసింది. “మా ‘రాక్సీ’ దిశా పటానీకి పుట్టినరోజు శుభాకాంక్షలు” అని అందులో పేర్కొంది. సో.. దీనిని బట్టి కల్కిలో దిశా పటానీ పేరు రాక్సీ అని తెలుస్తోంది. ఇక ఈ చిత్రంలో ఆమె ఓ కీలక రోల్ పోషించనుంది. తాజాగా విడుదల చేసిన ట్రైలర్‌ను గమనిస్తే ఇది అర్ధమవుతుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ నుంచి వస్తోన్న మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ‘కల్కి 2898 AD’. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో రూపొందిన ఈ మూవీకి క్రియేటివ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించగా.. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణే ఫిమేల్ లీడ్ రోల్ పోషిస్తుండగా.. మరొక నటి బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ కీలక పాత్రలో కనిపించనుంది. గ్లోబల్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో బాలీవుడ్ లెజెండరీ నటుడు అమితాబ్ బచ్చన్, విశ్వ నటుడు కమల్ హాసన్ వంటి స్టార్స్ నటిస్తున్నారు. వైజయంతి మూవీస్ పతాకంపై టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ అశ్వనీ దత్ దాదాపు రూ.500 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మించారు.
కాగా ‘కల్కి 2898 AD’ జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలకానుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ కార్యక్రమాలను ముమ్మురం చేసింది. దీనిలో భాగంగా ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజ్ చేసిన గ్లింప్స్, స్పెషల్ వీడియోస్ అన్నీ సినిమాపై అంచనాలను భారీగా పెంచేశాయి. ఇటీవల విడుదల చేసిన ట్రైలర్‌తో సినిమాపై అంచనాలు మరింతగా పెరిగాయి. ఇక ఈ మూవీలో బుజ్జి అనే కారు చాలా కీలక పాత్ర పోషించనుందని దర్శకుడు నాగ్ అశ్విన్ ఇప్పటికే తెలియజేశారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఆ కారును ఎఫ్ 1 రేసింగ్‌లో పాల్గొనే కార్ల వంటి మోడల్లో డిజైన్ చేయించడం విశేషం.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























