తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. బుధవారం ఉదయం 11 గంటల 27 నిమిషాలకు ఆయన ఆంధ్రప్రదేశ్ మూడో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. గన్నవరం సమీపంలోని కేసరపల్లి వద్ద అట్టహాసంగా నిర్వహించిన ఈ వేడుకకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షాతో పాటు పలువురు కేంద్ర మంత్రులు, ఎన్డీయే పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అలాగే సినీ, వ్యాపార సహా పలు రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొన్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇంతమంది అతిరథ మహారథులు హాజరైన ఈ వేడుకకు కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ హాజరయ్యారు. సతీమణి లతతో కలిసి వచ్చిన ఆయన ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఇక చంద్రబాబు తనయుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ రజినీకాంత్ దంపతులు, చిరంజీవి వద్దకు వెళ్లి నమస్కరించారు. వీవీఐపీలకు కేటాయించిన స్పెషల్ గ్యాలరీలో కూర్చున్న ఆయన టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి పక్కనే ఆసీనులయ్యారు. ఇద్దరు అగ్ర హీరోలు ఇలా ఒకే వేదికపై కనిపించడం అభిమానులను ఆకట్టుకుంది.
ఇక ఇదిలా ఉండగా.. మరోవైపు చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి రాష్ట్ర విశిష్ట అతిథిగా ‘మెగాస్టార్ చిరంజీవి’కి ప్రత్యేక ఆహ్వానం అందిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన సతీమణి సురేఖతో సహా ఈ వేడుకకు హాజరయ్యారు. చిరంజీవి సోదరుడు, జనసేనాని పవన్ కళ్యాణ్ అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వ ఏర్పాటులో కీలకంగా ఉండటమే కాకుండా ఏపీ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నేపథ్యంలో.. మెగా హీరోలు రామ్ చరణ్, సాయి తేజ్ సహా కుటుంబ సభ్యులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో టాలీవుడ్ అగ్ర నటుడు, హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ సహా నందమూరి కుటుంబసభ్యులు మరియు దర్శకుడు బోయపాటి శ్రీను, హీరోలు నారా రోహిత్, చైతన్య కృష్ణ తదితరులు కూడా హాజరయ్యారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:


































