ఆర్ఆర్ఆర్ సినిమా తరువాత ఎన్టీఆర్ నుండి ఇప్పటివరకూ ఎలాంటి సినిమా రాలేదు. ఆర్ఆర్ఆర్ రిలీజ్ అయి కూడా రెండు సంవత్సరాలు దాటిపోయింది. దీంతో తమ హీరోను సిల్వర్ స్క్రీన్ పై చూడాలని ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. ప్రస్తుతం అయితే తన నుండి వస్తున్న సినిమా దేవర. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈసినిమా రాబోతుంది. జనతా గ్యారేజ్ లాంటి సూపర్ హిట్ సినిమా తరువాత వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో ఈసినిమా భారీ అంచనాలు ఉన్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రస్తుతం ఈసినిమా శరవేగంగా షూటింగ్ ను పూర్తి చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే చాలాా వరకూ షూటింగ్ ను కూడా వరకూ పూర్తి చేసుకుంది. ఇదిలా ఉండగా ఇప్పుడు ఈసినిమా షూటింగ్ పై ఒక అప్ డేట్ వినిపిస్తుంది. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం గోవాలో జరుగుతోంది. గోవాలోని ఓ మారుమూల ప్రాంతంలో ఈ షూటింగ్ జరుగుతున్నట్లుగా చిత్ర యూనిట్ తెలిపింది. ఆ ప్రాంతంలో సినిమాలోని పలు కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్టు.. ఈ షూటింగ్ లో ఎన్టీఆర్ తో పాటు పలువురు కీలక ఆర్టిస్టులు పాల్గొంటున్నట్టు సమాచారం.
కాగా రెండు పార్ట్ లుగా రాబోతున్న ఈసినిమా మొదటి పార్ట్ అక్టోబర్ 10వ తేదీన రిలీజ్ కానుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా జాన్వీ కపూర్ నటిస్తుంది. బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నాడు. యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్ పై ఈసినిమాను నిర్మిస్తున్నారు. ఈసినిమాకు అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. శ్రీకర ప్రసాద్ ఎడిటర్ గా సబు సిరిల్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించనున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్



మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























