రెబల్ స్టార్ ప్రభాస్ కల్కి 2898ఏడి యూఎస్ఏ లో హావ కొనసాగిస్తోంది.ఇంకా ట్రైలర్ కూడా విడుదలకాలేదు అప్పుడే అడ్వాన్స్ బుకింగ్స్ ప్రీ సేల్స్ 300k డాలర్లను దాటింది.చూస్తుంటే ప్రీమియర్స్ ద్వారానే 2మిలియన్ మార్క్ ను చేరుకునేలా వుంది.ఈనెల 27న ఈసినిమా విడుదలకానుంది.ప్రమోషన్స్ కూడా భారీగానే ప్లాన్ చేశారు.ఈనెల 10న ట్రైలర్ ను విడుదలచేయనున్నారు. దాంతో అందరికి కళ్ళు ట్రైలర్ పైనే వున్నాయి.చాలా రోజుల తరువాత తెలుగులో విడుదలవుతున్న పెద్ద సినిమా కూడా ఇదే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
టికెట్ హైక్స్ ఉండడంతో కల్కి రికార్డు బ్రేకింగ్ ఓపెనింగ్స్ ను రాబట్టుకునే ఛాన్స్ ఎక్కువగా వుంది.ఇక ఈసినిమాకు బ్రేక్ ఈవెన్ టార్గెట్ కూడా పెద్దగానే వుంది.దాదాపు 600కోట్లు రాబడితే కానీ సేఫ్ కాదు.బ్లాక్ బాస్టర్ టాక్ వస్తే తప్ప ఈ మార్క్ ను చేరుకోవడం సాధ్యం కాదు.ఇప్పటివరకు రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.ట్రైలర్ కట్ కీలకం కానుంది.
మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న ఈసినిమాలో అమితాబ్ బచ్చన్,కమల్ హాసన్,దీపికా పదుకొణె ,దిశా పటాని కీలక పాత్రల్లో కనిపించనుండగా సంతోష్ నారాయణ్ సంగీతం అందిస్తున్నాడు.సుమారు 500కోట్ల బడ్జెట్ తో వైజయంతి మూవీస్ నిర్మిస్తుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























