ఈఏడాది ఆపరేషన్ వాలెంటైన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్. ఈ సినిమా డీసెంట్ హిట్ ను అందించింది. ఇప్పుడు మరో సినిమాతో వస్తున్నాడు. కరుణ కుమార్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా వస్తున్న సినిమా మట్కా. పీరియాడిక్ డ్రామాగా రాబోతున్న ఈసినిమా నుండి ఇప్పటికే గ్లింప్స్ ను రిలీజ్ చేయగా గ్లింప్స్ బాగానే ఆకట్టుకుంది. ఈసినిమా ఇప్పటి వరకూ పలు షెడ్యూల్స్ ను పూర్తి చేసుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇప్పుడు ఈసినిమా షూటింగ్ కు సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ అప్ డేట్ ను ఇచ్చారు మేకర్స్. ఈసినిమా తరువాత షెడ్యూల్ జూన్ 19వ తేదీన మొదలుపెట్టనున్నట్టు తెలిపారు. అంతేకాదు దీనికోసం ఒక భారీ వింటేజ్ వైజాగ్ సెట్ ను వేయనున్నారట. దాదాపు 40 రోజుల పాటు ఉండే ఈ షెడ్యూల్ లో వరుణ్ తేజ్, మీనాక్షి చౌదరి, నోరా ఫతేహి ఇంకా నవీన్ చంద్ర పై పలు కీలక సన్నివేశాలను, అలానే పాటలను చిత్రీకరించనున్నారట. ఈ సినిమాకు ఈ షెడ్యూలే కీలక షెడ్యూల్ అని.. దీంతో మ్యాగ్జిమమ్ షూటింగ్ పూర్తవుతుందని అంటున్నారు.
The new schedule of #VarunTej’s #Matka begins from 19th June. Currently, a massive set is being built in Ramoji Film City, Hyderabad to bring this mass-action entertainer to life.
More Interesting updates soon💥
Mega Prince @IAmVarunTej#NoraFatehi @Meenakshiioffl @KKfilmmaker pic.twitter.com/hIQucHUtXO
— Vyra Entertainments (@VyraEnts) June 7, 2024
కాగా ఈసినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తుండగా బాలీవుడ్ బ్యూటీ నోరా ఫతేహీ కూడా కీలక పాత్రలో నటిస్తుంది. నవీన్ చంద్ర మరో కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈసినిమాను పాన్ ఇండియా లెవల్లో భారీ స్థాయిలో నిర్మించనున్నారు. వైరా ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈసినిమాను తెలుగు తో పాటు తమిళ్, హిందీ, కన్నడ, మలయాళంలో ఈసినిమాను రిలీజ్ చేయనున్నారు. జీవి ప్రకాష్ ఈసినిమాకు సంగీతం అందిస్తున్నాడు. సినిమాటోగ్రాఫర్ గా కిషోర్ కుమార్ పనిచేస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























