ఇకపై కొత్త శర్వాని చూస్తారు – శర్వానంద్

Hero Sharwanand Reveals Interesting Facts About Manamey

టాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో శర్వానంద్ తన ల్యాండ్‌మార్క్ 35వ మూవీ ‘మనమే’ తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై రామ్‌సే స్టూడియోస్‌ ప్రొడక్షన్‌లో నిర్మాత టిజి విశ్వప్రసాద్‌ అత్యంత గ్రాండ్‌గా నిర్మించిన ఈ చిత్రంలో కృతి శెట్టి హీరోయిన్‌గా నటించారు. ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్, ఇతర ప్రమోషనల్ కంటెంట్ ట్రెమండస్ రెస్పాన్స్‌తో హ్యుజ్ బజ్‌ని క్రియేట్ చేశాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ నేపథ్యంలో ‘మనమే’ నేడు (శుక్రవారం,జూన్ 7) థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలయింది. ఈ క్రమంలో మేకర్స్ అంతకుముందు ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ వేడుకలో నిర్మాత టీజీ విశ్వప్రసాద్‌ శర్వానంద్‌కు ‘ఛార్మింగ్ స్టార్‌’ టైటిల్ ఇచ్చారు. ఈ మేరకు రూపొందించిన స్పెషల్ వీడియోను ఈవెంట్‍లో ప్రజెంట్ చేశారు. గ్రాండ్‌గా జరిగిన ఈ వేడుకలో టాలీవుడ్ స్టార్ డైరెక్టర్స్ మారుతి, శివ నిర్వాణ, సాయి రాజేష్, కిషోర్ తిరుమల అతిధులుగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా హీరో శర్వానంద్ చిత్ర విశేషాలు పంచుకున్నారు. శర్వానంద్ ఏమన్నారో ఆయన మాటల్లోనే.. “ఇరవైఏళ్ళు పట్టింది ఒక స్టార్ స్టేటస్ రావడానికి. ‘ఛార్మింగ్ స్టార్’ అనే టైటిల్ ఇచ్చిందుకు విశ్వగారికి చాలా థాంక్స్. అందరూ మహానుభావుడు, ఎక్స్ ప్రెస్ రాజా, రన్ రాజా రన్ లాంటి ఎంటర్ టైనర్స్ చేయమని కోరేవారు. నాకూ ఎప్పుడూ కొత్తగా చేయాలనే వుంటుంది. ఇందులో అలాంటి కొత్త క్యారెక్టరైజేషనే వుంది. శ్రీరామ్ ఆదిత్య ‘మనమే’ కథ ఎప్పుడో చెప్పారు. అన్ని సినిమాలు కాదని ఈ సినిమాని ఎంచుకోవడానికి కారణం బ్యూటీఫుల్ పాయింట్ టైం గురించి. మనిషి మనిషికి ఇవ్వగలిగే గొప్ప గిఫ్ట్ టైం.”

“ఈ సినిమాలో శ్రీరామ్ ఈ పాయింట్ ని చాలా చక్కగా చెప్పారు. శ్రీరామ్ చాలా పెద్ద డైరెక్టర్ అవుతారని ఆయన కెరీర్ బిగినింగ్ నుంచి చెబుతూనే వున్నాను. శ్రీరామ్.. ఐ హేట్ యూ . ఐ లవ్ యూ టూ. వాళ్ళ వైఫ్ మీ రెండో పెళ్ళామని ఎప్పుడూ అంటూ వుంటారు.(నవ్వుతూ).. వాళ్ళిద్దరూ ఎంత గొడవపడ్డారో తెలీదు కానీ మేము ఈ సినిమాకి అంత గొడవ పడ్డాం. లాస్ట్ 40 మినిట్స్ మిమ్మల్ని ఇంకో ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. ఎట్టిపరిస్థితిలో డిస్సాపాయింట్ చేయనివ్వం. ఈ సినిమా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అయ్యి తీరుతుంది. ఇందులో ఎటువంటి సందేహం లేదు.”

“ఈ సినిమాకి పని చేసిన ప్రతి ఒక్కరికీ థాంక్స్. తులసీ అమ్మ ఈ వేడుకు రావడం ఆనందంగా వుంది. శివ గారు, అరుణ్ గారు హీరోలుగా వున్నప్పుడు పక్క హీరో సినిమాలో గెస్ట్ రోల్ చేయడం మామూలు విషయం కాదు. దానికి గట్స్ వుండాలి. ఇద్దరికీ చాలా థాంక్స్. కృతిశెట్టి గారు చాలా స్వీట్. మైన్యూట్ ఎక్స్ ప్రెషన్స్ ఇవ్వడం చాలా కష్టం. ఆవిడ ఇచ్చే చిన్న చిన్న ఎక్స్ ప్రెషన్స్ సినిమాలో చూస్తారు. కృతితో కలసి పని చేయడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. విక్రమ్ ఆదిత్య చాలా బాగా నటించారు.”

“సీరత్ కపూర్, ఆయేషాతో వర్క్ చేయడం సో వండర్ ఫుల్. ఈ సినిమా హిట్ అయితే ఆ క్రెడిట్ శ్రీరామ్ ఆదిత్యకి ఇవ్వండి. ఏదైనా అనిపిస్తే ( ఆ ఛాన్స్ లేదు) ఆ భాద్యత నేను తీసుకుంటా. ఇక నుంచి కొత్త శర్వా చూడబోతున్నారు. థాంక్ యూ వెరీ మచ్, జయహో మనమే. శర్వా అనే నేను.. మీ అందరి సమక్షంలో జూన్ 7న మనమేతో వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ కొడతానని, ఎవరినీ డిస్సాపాయింట్ చేయనని హామీ ఇస్తున్నాను” అని హీరో శర్వానంద్ అన్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.