బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్ ఫుట్ బాల్ కోచ్ పాత్రలో నటించిన చిత్రం మైదాన్.ప్రముఖ ఇండియన్ ఫుట్ బాల్ కోచ్ సయ్యద్ అబ్దుల్ రహీమ్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కింది.ఈసినిమా ఏప్రిల్ లో విడుదలై పాజిటివ్ రివ్యూస్ తెచ్చుకున్నా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో వసూళ్లను రాబట్టుకోలేకపోయింది.ఫుల్ రన్ లో ప్రపంచ వ్యాప్తంగా 72కోట్ల గ్రాస్ వసూళ్లను మాత్రమే సొంతం చేసుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇప్పుడు ఈసినిమా ఓటిటిలోకి వచ్చింది.అమెజాన్ ప్రైమ్ ఈసినిమాను ఈరోజు నుండి స్ట్రీమింగ్ లోకి తీసుకొచ్చింది.అయితే కేవలం హిందీ భాషలో మాత్రం అందుబాటులో వుంది. ఈసినిమాను అమిత్ శర్మ డైరెక్ట్ చేయగా ప్రియమణి, గజరాజ్ రావు కీలక పాత్రల్లో నటించారు.ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందించారు. జీ స్టూడియోస్ తో కలిసి బోనీ కపూర్ మైదాన్ ను నిర్మించాడు.
ఇక అజయ్ దేవగణ్ ప్రస్తుతం సింగం ఎగైన్ లో నటిస్తున్నాడు.రోహిత్ శెట్టి ఈసినిమాను డైరెక్ట్ చేస్తుండగా అక్షయ్ కుమార్, రణవీర్ సింగ్, అర్జున్ కపూర్, టైగర్ ష్రాఫ్, కరీనా కపూర్, దీపికా పదుకొణె కీలక పాత్రల్లో కనిపించనున్నారు.ఈ సిరీస్ లో వచ్చిన సినిమాలు బ్లాక్ బస్టర్లు కావడంతో సింగం ఎగైన్ పై భారీ అంచనాలు వున్నాయి. ఈఏడాది చివర్లో థియేటర్లలోకి రానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:

































