కల్కి 2898AD ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్

kalki 2898 ad movie trailer release date fixed

కల్కి మంత్ మొదలైపోయింది. అందుకే ఈసినిమా నుండి వరుస అప్ డేట్లు ఇస్తూ సినిమాపై మరింత క్రేజ్ ను క్రియేట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటూనే మరోపక్క ప్రమోషన్ కార్యక్రమాల్లో కూడా స్పీడు పెంచారు. మరోవైపు ఈసినిమా నుండి ఇప్పటికే వచ్చిన పోస్టర్లు, వీడియోలు సినిమాపై భారీ అంచనాలు పెంచేశాయి. రీసెంట్ గా బుజ్జి పేరుతో ఉన్న కారును కూడా రిలీజ్ చేశారు. ఈ స్పెషల్ కారు ఈ సినిమాకు మరో హైలైట్‍గా నిలుస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. బుజ్జిభైరవ పేరుతో యానిమేటెడ్ సిరీస్ కూడా అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్‍కు వచ్చింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమా ట్రైలర్ కూడా రాబోతుంది. దీనికి సంబంధించిన అప్ డేట్ కూడా రానే వచ్చింది. తాజాగా చిత్రయూనిట్ ట్రైలర్ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేస్తూ అధికారికంగా ప్రకటించారు. జూన్ 10వ తేదీన ఈసినిమా ట్రైలర్ రిలీజ్ కానుంది.

కాగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో కల్కి 2898ఏడి రాబోతుంది. మహాభారతంతో మొదలై 2898 ఏడీ సంవత్సరంలో ముగుస్తుంది ఈ కథ. ఈసినిమాలో దీపికా పదుకొనె హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే ఈ సినిమాలో మరొక హీరోయిన్ బాలీవుడ్ యంగ్ బ్యూటీ దిశా పటానీ కూడా నటిస్తుంది. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, రాజేంద్రప్రసాద్‌, పశుపతి పలు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. వైజయంతి మూవీస్‌ పతాకంపై అశ్వనీదత్‌ దాదాపు రూ.500 కోట్ల బడ్జెట్ తో ఈసినిమాను నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రానికి తోట రమణి ఆర్ట్‌ డైరెక్టర్‌ గా వర్క్ చేస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.