యంగ్ హీరో కార్తికేయ నటించిన లేటెస్ట్ మూవీ భజే వాయు వేగం హిట్ దిశగా వెళుతుంది.పాజిటివ్ రివ్యూస్ వచ్చినా మొదటి రోజు మాత్రం తక్కువ ఓపెనింగ్స్ ను రాబట్టుకుంది అయితే మౌత్ టాక్ కూడా బాగుండడంతో పుంజుకొని మొదటి రోజు కంటే మిగితా రెండు రోజులు ఎక్కువ వసూళ్లను సొంతం చేసుకుంది.ఇక నిన్న వర్కింగ్ డే లోకూడా బాగానే హోల్డ్ చేసి మొదటి రోజు కన్నా ఎక్కువ వసూళ్లను సొంతం చేసుకుంది.నిన్న దాదాపు కోటి రూపాయల గ్రాస్ ను దక్కించుకుంది.దాంతో నాలుగు రోజుల్లో ఈసినిమా 6 కోట్ల గ్రాస్ వసూళ్లను ఖాతాలో వేసుకుంది.ఇందులో షేర్ 3కోట్లపైనే. కేవలం 4కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగడంతో మరో కోటి రూపాయల షేర్ ను రాబట్టుకుంటే బ్రేక్ ఈవెన్ ను చేరుకున్నట్లే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రశాంత్ రెడ్డి ఈసినిమాను డైరెక్ట్ చేయగా ఐశ్వర్య మీనన్ హీరోయిన్ గా నటించింది.హ్యాపీడేస్ ఫేమ్ టైసన్ రాహుల్ ,తనికెళ్ళ భరణి,రవిశంకర్ కీలక పాత్రలు పోషించారు.రధాన్ సంగీతం అందించాడు.యూవీ కాన్సెప్ట్స్ ఈసినిమాను నిర్మించింది.
ఇక ఈసినిమా తో కార్తికేయ వరసగా రెండో విజయాన్ని ఖాతాలో వేసుకోనున్నాడు.వరస పరాజయాల తరువాత గత ఏడాది బెదురులంక తో సక్సెస్ ను చూశాడు కార్తికేయ.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:
































