అఫీషియల్- సూర్య 44 లో పూజా హెగ్డే

pooja hegde on board for suriya 44 movie

తమిళ్ స్టార్ హీరో సూర్య మాత్రం వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ఇప్పటికే సూర్య శివ దర్శకత్వంలో కంగువ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. హిస్టారికల్ వార్ బ్యాక్‌డ్రాప్‌‌లో.. ఈ సినిమా 1000 సంవత్సరాల క్రితం జరిగిన కథ ఆధారంగా తెరకెక్కుతుంది. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను పూర్తిచేసుకుంటూనే మరోపక్క పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది. ఈసినిమాలో సూర్య సరసన దిశా పటాని హీరోయిన్ గా నటిస్తుంది. బాబి డియోల్ కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాని స్టూడియో గ్రీన్ తో పాటు టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ సంస్థ యు.వీ క్రియేషన్స్ కూడా కలిసి నిర్మిస్తుంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. మొత్తం 3డీ వర్షెన్‌లో 10 భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక దీనితో పాటు సూర్య కార్తీక్‌ సుబ్బరాజ్‌ దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం అయితే సూర్య44 అనే వర్కింగ్ టైటిల్ తోనే ఈసినిమా తెరకెక్కుతుంది. ఇదిలా ఉండగా ఈసినిమాలో పూజా హెగ్డే నటిస్తున్నట్టు ఇప్పటికే వార్తలు చక్కర్లు కొట్టిన సంగతి తెలిసిందే. పూజా హెగ్డే కూడా దీనిపై క్లారిటీ ఇచ్చేసింది. ఇప్పుడు ఆవార్తలను నిజం చేస్తూ చిత్రయూనిట్ నుండి అధికారిక ప్రకటన వచ్చేసింది. ఈసినిమాలో పూజా హెగ్డే నటిస్తున్నట్టు అధికారిక ప్రకటన ఇచ్చారు మేకర్స్.

కాగా మలయాళం నటుడు జోజు జార్జ్‌ కీలక పాత్ర పోషిస్తున్న ఈసినిమాను స్టోన్‌ బెంచ్‌ ఫిల్మ్‌తో కలిసి సూర్య 2డి ఎంటర్‌టైన్‌మెంట్స్‌ భారీగా నిర్మిస్తుంది. సంతోష్‌నారాయణ్‌ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.