టాలీవుడ్ ప్రామిసింగ్ హీరో శర్వానంద్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాతో బిజీగా ఉన్నాడు. అందులో ముందుగా రిలీజ్ కు సిద్దంగా ఉన్న సినిమా మనమే. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో వస్తున్న ఈసినిమా జూన్ 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ప్రస్తుతం చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. దీనిలో భాగంగానే ఇప్పటికే ఈసినిమా నుండి టీజర్, పలు పాటలను రిలీజ్ చేయగా అవి మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇప్పుడు ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఈసినిమా ట్రైల్ర ను రిలీజ్ చేశారు. ట్రైలర్ అయితే ఆద్యంతం అలరిస్తుంది. శర్వానంద్, కృతిశెట్టి ఇంకా చిన్నబాబు చుట్టూ కట్ చేసిన ట్రైలర్ కలర్ ఫుల్ గా ఉండి ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా శర్వానంద్ కేర్ ప్రీ క్యారెక్టర్ ఈసినిమాకు మెయిన్ హైలెట్ గా నిలిచేలా కనిపిస్తుంది. కామెడీ ఎలిమెంట్స్, శర్వానంద్-కృతిశెట్టి మధ్య వచ్చే సన్నివేశాలు, ఎమోషనల్ సీన్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అన్నీ హైలెట్ గా నిలుస్తున్నాయి. ట్రైలర్ ను చూస్తుంటే శర్వాకు మనమేతో మంచి హిట్ పడేలానే కనిపిస్తుంది. చూద్దాం మరి ఈసినిమా శర్వాకు ఎలాంటి విజయాన్ని అందిస్తుందో తెలియాలంటే రిలీజ్ వరకూ వెయిట్ చేయాల్సిందే.
#ManameyTrailer looks Funtastic and Fun. Best wishes to my dearest @ImSharwanand 🤗
Good luck to the entire team of #Manamey 👍🏻
Looking forward to the film on June 7th!@IamKrithiShetty @SriramAdittya @vishwaprasadtg @HeshamAWMusic @IamSeeratKapoor… pic.twitter.com/CoIrZUiE3E
— Ram Charan (@AlwaysRamCharan) June 1, 2024
ఇంకా ఈసినిమాలో విక్రమ్ ఆదిత్య, సీరత్ కపూర్, అయేషా ఖాన్, వెన్నెల కిషోర్, రాహుల్ రవీంద్రన్, రాహుల్ రామకృష్ణ, శివ కందుకూరి, సుదర్శన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాకు హేషమ్ అబ్దుల్ వాహబ్ సంగీతం అందిస్తున్నాడు. విష్ణు శర్మ, జ్ఞాన శేఖర్ వీఎస్ సినిమాటోగ్రాఫి అందిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























